గూగుల్ మ్యాప్ ను మీరూ అప్ లోడ్ చేయొచ్చు..

గూగుల్ మ్యాప్ ను మీరూ అప్ లోడ్ చేయొచ్చు..

ప్రపంచవ్యాప్తంగా మిస్సింగ్ రోడ్‌లను గూగుల్ మ్యాప్స్‌కు జోడించడానికి తన రోడ్ మ్యాపర్ ఫీచర్‌లో పాల్గొనడానికి మరింత మంది కంట్రిబ్యూటర్లకు ఆహ్వానిస్తున్నట్లు గూగుల్ మంగళవారం తెలిపింది. 2021లో రోడ్ మ్యాపర్‌ని ప్రారంభించినప్పటి నుంచి  కంట్రిబ్యూటర్లు1.5 మిలియన్ కిమీల రోడ్‌లను మ్యాప్ చేశారు. 200 మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు Google మ్యాప్స్‌తో నావిగేట్ చేయబడుతున్నారని గూగుల్ తెలిపింది. 

ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ మ్యాప్ ప్రజల జీవనాన్ని సులభతరం చేసింది. ఇంకా మాసేవలను మరింత మెరుగు పర్చేందుకు కంటిబ్యూటర్లకు యాక్సెస్ ప్రారంభిస్తున్నామని టెక్ దిగ్గజం తెలిపింది. 
రోడ్ మ్యాపర్ ద్వారా శాటిలైట్ చిత్రాలను ఉపయోగించి గూగుల్ మ్యాప్ లోలేని రోడ్ల జ్యామితిని గీస్తారు.  కంట్రిబ్యూటర్స్ సహాయంతో Google మ్యాప్స్‌ను అత్యుత్తమంగా చేయగలమని విశ్వసిస్తున్నాం" అని టెక్ దిగ్గజం ప్రకటించింది.