స్టోరేజ్ కు సంబంధించి గూగుల్ కొత్త అప్ డేట్ తీసుకొచ్చింది. వినియోగదారుల పెరుగుతున్న అవసరాలను తీర్చడంతో పాటు స్టోరేజ్ సమస్య నుంచి గట్టెక్కించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఇది వరకు గూగుల్ డ్రైవ్‌లో ఉన్న 15 జీబీ ఫ్రీ మెమరీ స్టోరేజ్‌ని 1 టీబీకి పెంచుతూ గూగుల్ నిర్ణయం తీసుకుంది.
‘‘యువర్ స్టోరేజ్ ఈజ్ ఫుల్” అనే పదం చాలా మందిని విసిగించే ఉంటుంది. మొబైల్ ఫోన్స్‌లో ఉండే స్టోరేజ్ సరిపోక, ఫోన్‌లో మెమరీ కార్డ్ ఎక్స్‌పాన్షన్ ఆప్షన్ లేక చాలా మంది మొబైల్‌లో స్టోరేజ్ ఫుల్ అయి ఇబ్బంది పడుతుంటారు. అలాంటివాళ్లు పెన్ డ్రైవ్‌లోనో, గూగుల్ డ్రైవ్‌లోనో ఫొటోస్, ఫైల్స్ సేవ్ చేసుకుంటారు. అయితే, ఇప్పటివరకు గూగుల్ డ్రైవ్‌లో 15 జీబీ మెమరీ స్టోరేజ్ మాత్రమే ఫ్రీగా ఉండేది. అది కూడా ఫుల్ అయితే, మంత్లీ ప్లాన్స్‌తో నెలకు కొంత డబ్బు కట్టి స్టోరేజ్‌ని పెంచుకునే ఆప్షన్ ఉండేది. గూగుల్ ప్రస్తుతమున్న 15 జీబీ ఫ్రీ మెమరీ ఆప్షన్‌ను అప్‌డేట్‌లో 1 టీబీకి పెంచడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. స్టోరేజీ పెంచుకునేందుకు వినియోగదారులు కొత్తగా గూగుల్ డ్రైవ్‌ని అప్‌డేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమెటిక్‌గా 1 టీబీ స్టోరేజ్ డ్రైవ్‌లో యాడ్ అవుతుంది.