Good News: అందరికీ గూగుల్ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్..ఎలా పని చేస్తుంది..ఉపయోగాలు ఏంటీ..?

Good News: అందరికీ గూగుల్ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్..ఎలా పని చేస్తుంది..ఉపయోగాలు ఏంటీ..?

యూజర్లకు గూగుల్ గుడ్ న్యూస్ చెప్పింది. యూజర్లందరికి గూగుల్ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ అందించనుంది. ఇదివరకు ఇది ఈ ఫీచర్ కేవలం గూగుల్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు గూగుల్ అకౌంట్ ఉన్న ప్రతి యూజర్ కు ఈ ఫీచర్ ను అందించనుంది. కొన్ని వారాల క్రితం గూగుల్ వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్( VPN) సర్వీస్ నిలిపి వేసింది. దీని తర్వాత  యూజర్ల భద్రత కోసం గూగుల్ ఈ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ ను యూజర్లందరికీ అందించేందుకు సిద్దమైంది. డార్క్ వెబ్ రిపోర్ట్ అంటే ఎలా పనిచేస్తుంది. దీంతో ఉపయోగాలేంటో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.. 

గూగుల్ యూజర్ల పర్సనల్ డేటా ఏదైతే దొంగిలించబడినట్లే గుర్తిస్తే వెంటనే యూజర్లు ఈ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ తెలియజేస్తుంది.ఎప్పుడైతే యూజర్ కు సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్, పేరు, అడ్రసు, యూజర్ నేమ్, పాస్ వర్డ్, సోషల్ సెక్యూరిటీ నంబర్ వంటి సమాచారాన్ని ఎవరైనా సెర్చ్ చేసినవెంటనే గూగుల్ యూజర్లకు సమాచారం అందజేస్తుంది. డేటాను ఎలా కాపాడుకోవాలో కూడా సూచిస్తుంది. గూగుల్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూజర్లకు ఈ డార్క్ వెబ్ రిపోర్ట్ ఫీచర్ ఇంతకుముందు నుంచే అందుబాటులో ఉంది.. ఇప్పుడు ఈ ఫీచర్ యూజర్లందరికీ అందించేందుకు గూగుల్ సిద్ధమయింది. అయితే గూగుల్ వర్క్ స్పేస్, లేదా సూచించిన అకౌంట్లకు ఈ ఫీచర్ యాక్సెస్ లేదు.