Google గతంలో చెప్పినట్టుగానే Google One VPN సేవలను మూసివేస్తోంది..దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. జూన్ 20, 2024 నుంచి Google One ద్వారా VPN సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Pixel 8, కొత్త డివైజ్ లు సిస్టమ్ సెట్టింగులలో ఇన్ బుల్ట్ గా VPN ని అందిస్తున్నాయని Google తెలిపింది.అయితే వీటికంటే ముందు వర్షన్ డివైజ్ లలో సిస్టమ్ అప్ డేటెడ్ తర్వాత ఈ సేవలను వినియోగించుకోవచ్చని తెలిపింది. Google One ద్వారా VPNని Google One యాప్ నుండి తీసివేసిన తర్వా త Pixel 7 వినియోగదారులు తమ సిస్టమ్ సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేసినప్పుడు VPN ఫంక్షనాలిటినీ ఉపయోగించుకోవచ్చు. Pixel 7, 7 Pro, 7a, Fold డివైజ్ లకోసం అంతర్నిర్మిత VPN ద్వారా Google ద్వారా VPNని ప్రారంభించడానికి కంపెనీ జూన్ 3, 2024న సిస్టమ్ అప్డేట్ లను విడుదల చేయనుంది.
VPN అంటే ఏమిటి?
VPN అంటే అకా వర్చువల్ ప్రైవేట్ నెట్ వర్క్ .ఇది వివరాలకు భద్రత కల్పించేందుకు ఇంటర్నెట్ ను సురక్షితంగా వినియోగించుకునేందుకు ఉపయోగపడుతుంది. మీరు వెబ్ సైట్ ను ఓపెన్ చేసినప్పుడు మీ డివైజ్ నుంచి ఆ సైట్ కి డేటా వెళుతుంది. కానీ అన్నింటిలో మొదటగా ఇంటర్నెట్ యాక్సెస్ చేయడానిికి ఉపయోగిస్తున్న WiFi రూటర్ ద్వారా వెళ్తుంది. తర్వాత ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ద్వారా వెళ్తుంది. VPN లు మీ డివైజ్ , VPN సర్వర్ మధ్య ఎన్ క్రిప్టెడ్ కనెక్షన్ సృష్టించడం ద్వారా మీ నెట్ వర్క్ డేటాను దాచిపెడతాయి. దీంతో మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా మీ డివైజ్ VPN సర్వర్ మధ్య మీరు ఏ వెబ్ సైట్ బ్రౌజ్ చేస్తున్నారో లేదా ఏ యాప్ లు ఉన్నాయో ఇతరులు చూడటం సాధ్యంకాదు.
అయితే భారతదేశంలోని Google One వినియోగదారులు ఆందోళన చెం దాల్సిన అవసరం లేదని తెలిపింది.