భూకంపం ఎప్పుడు వచ్చేది గూగుల్ చెప్పేస్తుంది.. ఫోన్లలో అలర్ట్

 భూకంపం ఎప్పుడు..ఎక్కడ వస్తుందో  తెల్వదు. అది తెలిస్తే ప్రాణనష్టాన్ని, ఆస్తి నష్టాన్ని ఎంతో కొంత తగ్గించుకోవచ్చు. ఇలాంటి ప్రకృతి విపత్తుల నుంచి అలర్ట్ చేయడానికి   గూగూల్  కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమయ్యింది. భూకంప అప్రమత్త సందేశాలను పంపే వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.  ఈ కొత్త ఫీచర్ తో   ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్న కస్టమర్స్ కు  ముందుస్తుగానే భూకంప హెచ్చరిక మెసేజ్ వస్తుంది.  ఇందుకోసం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ (ఎన్‌డీఎంఏ),  నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ (ఎన్‌ఎస్‌సీ)తో కలిసి ఈ మెసేజ్ లు పంపించనున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఈ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.  ఇటువంటి వ్యవస్థను గూగుల్ ఇప్పటికే పలు దేశాల్లో అమలు చేస్తోంది. 

అది ఎలా పని చేస్తుంది

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో సీస్మోగ్రాఫ్‌గా  పనిచేసే చిన్న యాక్సిలరోమీటర్ లు ఉంటాయి.  ఫోన్ ఛార్జ్ అవుతున్నప్పుడు అది భూకంప సంకేతాలను పసిగట్టగలదు.  అయితే ఒకే సమయంలో భూకంప  ప్రకంపనలను  చాలా ఫోన్‌లు పసిగట్టినట్లయితే.. తమ కంపెనీ సర్వర్‌ ఈ సంకేతాలను మొత్తం సేకరించి ఆ ప్రదేశంలో భూకంపం వచ్చిందేమో చెక్‌ చేస్తాయి.  తర్వాత  Google సర్వర్ సమీపంలోని ఇతర ఫోన్‌లకు హెచ్చరికలను పంపుతుంది.

భూకంప తీవ్రతను బట్టి హెచ్చరికలు రెండు రకాలుగా  ఉంటాయి.  భూకంప తీవ్రత 4.5 లేదా అంతకంటే తక్కువ భూకంపం వచ్చినప్పుడు MMI 3 & 4  బీ అవేర్ అలర్ట్ అని.. 4.5 లేదా అంతకంటే ఎక్కువ తీవ్రతతో భూకంపం వస్తే MMI 5+ గా   టేక్ యాక్షన్ అలర్ట్ అని హెచ్చరికలు పంపుతుంది. అయితే ఈ అలర్ట్‌లను అందుకోవాలంటే  కస్లమర్ల ఫోన్లలో తప్పనిసరిగా ఇంటర్నెట్‌ ఉండాలి. అయితే ఈ అలర్ట్‌లను ఆఫ్‌ చేసుకొనేందుకు ఓ ఆప్షన్ కూడా ఉంది.