ఈ ఐదు యాప్స్ తో స్మార్ట్ ఫోన్ వినియోగం.. మరింత స్మార్ట్

ఈ ఐదు యాప్స్ తో స్మార్ట్ ఫోన్ వినియోగం.. మరింత స్మార్ట్

స్మార్ట్ ఫోన్ వినియోగాన్ని మరింత స్మార్ట్ గా తీర్చిదిద్దేలా గూగుల్ ఆరు యాప్ లను విడుదల చేసింది.  పోస్ట్ బాక్స్, వి ఫ్లిప్, పేపర్ ఫోన్ , డిసర్ట్ ఐల్యాండ్ , మార్ఫ్ అనే యాప్ లను అందుబాటులోకి తెచ్చింది.

పోస్ట్ బాక్స్ – పోస్ట్ బాక్స్ యాప్ ద్వారా నోటిఫికేషన్స్ ను ఒకేసారి చూసేందుకు ఉపయోగపడుతుంది.   డెలాయిట్ కంపెనీ చేసిన సర్వేలో మొబైల్, ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చాయో తెలుసుకునేందుకు స్మార్ట్ ఫోన్ ను ప్రతీరోజు 25 సార్లు చెక్ చేసుకుంటున్నట్లు తేలింది. అదే ఈ యాప్ ద్వారా మనం ఏం టైంలో నోటిఫికేషన్ చూడాలో టైం షెడ్యూల్ సెట్ చేసుకుంటే..ఆ టైంకే నోటిఫికేషన్స్ అన్నీ ప్రత్యక్షమవుతాయి. దీంతో మనం అన్నీ నోటిఫికేషన్స్ ను ఒకేసారి చూసుకోవచ్చు.

వి ఫ్లిప్  – మీ స్నేహితులు గుంపుగా చేరి మాట్లాడుకోవడం మానేసి..స్మార్ట్ ఫోన్ కు అతుక్కుపోతుంటారు. అలాంటి సమయాల్లో ఫోన్ వాడకుండా..ఒకరికొకరు మాట్లాడుకునేలా ఈ యాప్ ఉపయోగపడుతుంది. మీ ఫోన్ లో, మీ స్నేహితుల ఫోన్ లో వి ఫ్లిప్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. సరదగా గడిపే సమయంలో ఫోన్ అన్ లాక్ చేసి ఉంచితే…వి ప్లిప్ యాప్ ద్వారా ఎవరు ఫోన్ వాడుతున్నారో పసిగట్టేయవచ్చు.

పేపర్ ఫోన్ – పర్సనల్ ఇన్మర్మేషన్, కాంటాక్ట్ నెంబర్స్, ఇంపార్టెంట్ డేట్స్ , మీటింగ్స్ షెడ్యూల్ ను పేపర్ ఫోన్ యాప్ లో స్టోర్ చేసుకునేందుకు ఉపయోగపడుతుంది.

డిసర్ట్ ఐల్యాండ్ – మనం ఏదైనా టూర్ కు వెళితే స్మార్ట్ ఫోన్ లో మునిగిపోకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. టూర్ లో మనకు కావాల్సిన యాప్ లకు అన్ లాక్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. అవసరం లేని యాప్ లకు లాక్ చేసుకోవచ్చు.

మార్ఫ్ యాప్ – ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే..స్మార్ట్ ఫోన్ లో మనం ఏ యాప్ ను ఎంత సేపు చూశామనేది తెలుసుకోచ్చు. అది ఇల్లైనా, ఆఫీస్ అయినా ఉన్న ప్రదేశాన్ని బట్టి క్యాలిక్లేట్ చేసి చెబుతుంది.