ఫొటోలను సెర్చ్ చేయడానికి గూగుల్ లెన్స్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ఇప్పుడు ఆ ఫీచర్ని మరింత అప్గ్రేడ్ చేశారు. ఇక గూగుల్ లెన్స్ ద్వారా వీడియోలను కూడా సెర్చ్ చేయొచ్చట! ఈ ఫీచర్ కదిలే వస్తువుల్ని, ఆకారాలను, రంగుల్ని, మెటీరియల్స్ వంటివి ఏవైనా ఈజీగా ఐడెంటిఫై చేయగలదు.
గూగుల్ లెన్స్ వీడియో రికార్డింగ్ చేయగలిగే సామర్థ్యంతో ఉంది. కాబట్టి ఇకపై గూగుల్ లెన్స్ ద్వారా 20 సెకండ్ల నిడివితో ఉన్న వీడియోను ఉపయోగించి వెతకొచ్చు. ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసుకుంటే వీడియోలో ఉన్న వస్తువులు, ప్రదేశాలను వెబ్ సెర్చ్ చేయొచ్చు. ఇది పనిచేయడానికి అడ్వాన్స్డ్ ఏఐ మోడల్ అయిన జెమిని ఉపయోగపడుతుంది. అదెలాగంటే.. గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి, సెర్చ్ మోడ్ ఆన్ చేసి క్యాప్చర్ ఐకాన్ మీద ఎక్కువ సేపు నొక్కి ఉంచాలి. అప్పుడు రికార్డింగ్ స్టార్ట్ అవుతుంది. రికార్డ్ అయిన తర్వాత దాన్ని సెర్చ్ చేస్తే రెండు లేదా మూడు సెకన్లలోనే రెస్పాన్స్ వస్తుంది.