వినియోగదారుల ప్రయాణం సులభతరం చేసేందుకు Google Maps ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తోంది. తాజాగా Bluetooth beacons అనే కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది కేవలం ఆండ్రాయిడ్ యూజర్స్ మాత్రమే అందుబాటులో ఉంది. ఇంకా iOS వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి వస్తుంది.
ఎప్పుడైన టన్నెల్ లోకి గానీ, శాటిలైట్ సిగ్నల్ అందుబాటులో లేని ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు ఈ ఫీచర్ మీకు ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ ద్వారా Google Maps మిమ్మల్ని గమ్యానికి చేర్చుతుంది.ఇది సరికొత్త ఫీచర్.. Google తన ఫీచర్ మద్దతులో జీపీఎస్ సిగ్నల్ చేరని ప్రాంతాల్లో డ్రైవర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా నావిగేషన్ అందిస్తుంది. లొకేషన్ సేవలను నిర్ధారిస్తుంది. సొరంగం లోపల మెరుగైన సేవలు అందిస్తుంది.