గూగుల్ అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న సమాచారం కావాలన్న వెంటనే గూగుల్ తల్లిని ఆశ్రయిస్తున్నారు. బ్రెయిన్‌కు కొంచెం కూడా పని చెప్పకుండా కావాల్సిన ఇన్ఫర్మేషన్ను క్షణాల్లో గూగుల్ ద్వారా తెలుసుకుంటున్నారు. సమాచారం కోసం గూగుల్‌ను ఆశ్రయిస్తుండగా.. ఏదైనా తెలియని ప్రదేశాలకు సంబంధించిన సమాచారం కోసం గూగుల్ మ్యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, ఇటీవల జరిగిన ఓ ఘటన గూగుల్ మ్యాప్స్పై పనితీరుపై మరోసారి సందేహాలను లేవనెత్తింది.
గూగుల్ మ్యాప్స్ ఆధారంగా వెళ్లిన ఓ ముగ్గురు యువకులు నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి మీద నుండి కింద పడి మృతి చెందారు. బ్రిడ్జి నిర్మాణంలో ఉన్న విషయాన్ని గూగుల్ గుర్తించకపోవడంతో దాని ఆధారంగా వెళ్లిన యువకులు బ్రిడ్జి పై నుండి కిందపడి మరణించారు. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలోని ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
దీంతో గూగుల్ మ్యాప్స్ పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించేవారికి టెక్ నిపుణులు కీలక సూచనలు చేశారు. గుడ్డిగా గూగుల్ మ్యాప్స్ నమ్మకుండా కొన్ని టిప్స్‌తో గూగుల్ మ్యాప్ వల్లే జరిగే ప్రమాదాలను అరికట్టవచ్చని అంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం మరీ మనం కూడా.
1. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే ముందు మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్స్ మ్యాప్స్‌ని అప్డేట్ చేసుకోండి. గడువు ముగిసిన మ్యాప్‌లు కొన్నిసార్లు తప్పుడు సమాచారాన్ని సూచిస్తాయి. కాబట్టి.. ఎప్పటికప్పుడు గూగుల్ మ్యాప్స్‌ను అప్డేట్ చేసుకోవడం ఉత్తమం. కంపెనీ తీసుకొచ్చే లేటేస్ట్ ఫీచర్లను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడం ద్వారా మ్యాప్స్ సరైన లక్ష్యాన్ని సూచిస్తాయి.
2. గూగుల్ మ్యాప్స్ ఉపయోగించే సమయంలో మనం వెళ్లాల్సిన రూట్ స్పష్టంగా అర్థం కాకపోతే వెంటనే స్థానికులను అడిగి తెలుసుకోండి. ఎందుకంటే మ్యాప్ ఎప్పుడు ప్రస్తుత రహదారి పరిస్థితులను సూచించకపోవచ్చు.
3. తెలియని ప్రదేశానికి ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు మార్గం కోసం గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేసే ముందు యాప్‌లోని ‘స్ట్రీట్ వీవ్’ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించి లాంగ్ రూట్ మ్యాప్ కాకుండా స్ట్రీట్ వీవ్ లోకేషన్ పెట్టుకుని మ్యాప్‌లో జూమ్ చేయడం ద్వారా రోడ్లు ఎక్కడ ఇరుకైనవిగా ఉన్నాయి.. ఏవైనా రోడ్లు క్లోజ్ చేసి ఉన్నాయో ఈజీగా గుర్తించవచ్చు.
4. ‘స్ట్రీట్ వీవ్’ ఆప్షన్ ఉపయోగించడానికి మొబైలోని గూగుల్ మ్యాప్‌లోని దిక్సూచి పైన ఉన్న బటన్ నొక్కండి. తర్వాత స్ట్రీట్ వీవ్ ఆప్షన్ ఎంచుకుని ఆ తర్వాత వెళ్లాల్సిన లోకేషన్ గురించి సెర్చ్ చేయండి. జర్నీ స్టార్ట్ చేసే ముందు గూగుల్ మ్యాప్స్ సూచించిన దిశలను క్లారిటీ కోసం జూమ్ ఇన్ చేసి చూడండి. ఇలా చేయడం ద్వారా వెళ్లాల్సిన రూట్ పై ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. గూగుల్ మ్యాప్స్‌లో రోడ్డు మూసివేతలు, రిపేర్లు ఇతర్రతా సంబంధిత సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉండకపోవచ్చు. అందుకే స్ట్రీట్ వీవ్ ఆప్షన్ ఎంచుకుంటే ఖచ్చితమైన మార్గం సూచిస్తుంది.