Google Mapsలో10వేల ఫేక్ బిజినెస్ ఖాతాలు తొలగింపు

Google Mapsలో10వేల ఫేక్ బిజినెస్ ఖాతాలు తొలగింపు

గూగుల్ ఎప్పటికప్పుడు తన కస్టమర్లకు మెరుగైనసేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా Google Mapsలో ఫేక్ బిజినెస్ అకౌంట్లను గుర్తించి తొలగించింది.గూగుల్ మ్యాప్స్ లో బిజినెస్ ఖాతాల ప్రొఫైల్స్ లో సవరణలు, 5స్టార్ రేటింగ్ లపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సమీక్షించింది. దాదాపు 10వేల ఫేక్ బిజినెస్ ఖాతాలను తొలగించింది.Google Mapsలో వ్యాపార సమాచారంలో మరింత విశ్వసనీయతను పెంచేందుకు కొత్త చర్యలను వివరిస్తూ Google బ్లాగ్ పోస్ట్‌ ద్వారా ప్రకటించింది. 

నకిలీ ప్రొఫైల్ సవరణలు

గూగుల్ బ్లాక్ పోస్ట్ ప్రకారం..గూగుల్ జెమిని AI సాయంతో ఓ కొత్త మోడల్ ను అభివృద్ది చేశారు. ఇది అనుమానాస్పద బిజినెస్ ప్రొఫైల్స్ గుర్తిస్తుంది. అకస్మాత్తుగా బిజినెస్ పేరును మార్చుకున్న అనుమానాస్పద ఖాతాలను గుర్తించింది.ఇలాంటి వేలాది బిజినెస్ ప్రొఫైల్స్ ను గుర్తించి ఏడాది పాటు బ్లాక్ చేసింది. 

నకిలీ 5-స్టార్ సమీక్షలు

బిజినెస్ ప్రొఫైల్ అనుమానాస్పద సవరణపై చర్యలతో పాటు గూగుల్ ఫేక్ 5స్టార్ రేటింగ్స్ పై కూడా కఠిన చర్యలు చేపడుతోంది. అనేక వ్యాపార సంస్థలు కస్టమర్లు సందర్శించకున్నా ఫేక్ 5స్టార్ రివ్యూలను కొనుగోలు చేసి కస్టమర్లను మోసం చేస్తున్నారని గుర్తించింది. దీనికోసం గూగుల్ జెమిని సాయంతో అటువంటి ఖాతాలను తొలగించింది.

Also Read:- రూ.63వేల కోట్ల మెగా డీల్..

గతేడాది అధునాతన మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌ల ద్వారా Google రూల్స్ ఉల్లంఘించిన 240 మిలియన్లకు పైగా సమీక్షలను బ్లాక్ చేసింది. 12 మిలియన్లకు పైగా ఫేక్ బిజినెస్ ప్రొఫైల్స్ తొలగించింది.