ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్ : గూగుల్ మ్యాప్స్లో స్పీడ్ మీటర్, స్పీడ్ లిమిట్ ఆప్షన్స్

ఐఫోన్ యూజర్లకు గుడ్న్యూస్ : గూగుల్ మ్యాప్స్లో స్పీడ్ మీటర్, స్పీడ్ లిమిట్ ఆప్షన్స్

ఐఫోన్, కార్ ప్లే యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది గూగుల్ సంస్థ. త్వరలో గూగుల్ మ్యాప్ లో స్పీడో మీటర్, స్పీడ్ లిమిట్ ఫీచర్లను అందించనుంది. ఈ ఫీచర్లు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ వినియోగ దారులకు ఇప్పటికే అందుబాటులో ఉంది.ప్రపంచ వ్యాప్తంగా 40 దేశాల్లో ఈఫీచర్ అందుబాటులో ఉంది. అయితే ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్ అందించిన ఐదేళ్ల తర్వాత డ్రైవింగ్ లో ఎంతో ఉపయోగకరంగా ఉండేందుకు ఐఫోన్, కార్ ప్లే యూజర్లకు స్పీడోమీటర్, స్పీడ్ లిమిట్ ఫీఛర్లను అందిస్తున్నట్లు గూగుల్ సంస్థ తాజాగా ఓ నివేదికలో తెలిపింది.   

ఈ కొత్త ఫీచర్ iOS 6.123.0 వెర్షన్ కు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ యాక్సెస్ చేయాలంటే మీ ఐఫోన్ డివైజ్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి.. ప్రొఫైల్ పై నొక్కాలి.  సెట్టింగ్ లోకి వెళ్లి నావిగేషన్ , డ్రైవింగ్ ఆప్షన్ ను క్లిక్ చేయడం ద్వారా స్పీడో మీటర్, /స్పీడ్ లిమిట్ ఎనేబుల్ అవుతుంది. డ్రైవింగ్ చేస్తున్నపుడు స్పీడ్ లిమిట్స్ పీచర్ నావిగేషన్ స్క్రీన్ కింద ఎడమ మూలన సర్కిల్ ఫ్లోటింగ్ ఐకాన్ గా చూపించబడుతుంది. 

ఐఫోన్ యూజర్లు గూగుల్ మ్యాప్ నావిగేషన్ స్టాట్ చేసినప్పుడు వెహికల్ స్పీడ్ మైల్స్ లేదా కిలోమీటర్లు తెలియజేయబడుతుంది. స్పీడ్ పెంచుతున్నప్పుడు కలర్స్ మారుతూ స్పిడ్ లిమిట్ లో డ్రైవ్ చేయాలని మీకు సూచిస్తుంది.