Technology : వాట్సాప్ తరహాలో గూగుల్ మ్యాప్ షేరింగ్ ఆప్షన్

Technology : వాట్సాప్ తరహాలో గూగుల్ మ్యాప్ షేరింగ్ ఆప్షన్

గూగుల్ మ్యాప్స్, నావిగేషన్ యాప్ ఇటీవలే వాట్సాప్, టెలిగ్రామ్‌ల మాదిరిగానే కొత్త ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ యూజర్లు తమ లైవ్ లొకేషన్‌ను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది. బ్యాటరీ స్టేటస్, నావిగేషన్ సమయంలో అంచనా వేసిన సమయం వంటి వ్యవధి, అదనపు వివరాలతో సహా ప్రాధాన్యతలను పంచుకోవడానికి ఇది వారికి అనుమతిస్తుంది.  

గూగుల్ మ్యాప్స్ నుపయోగించి లైవ్ లొకేషన్ ను ఎలా షేర్ చేయాలంటే..

  • Google మ్యాప్స్‌ని ఓపెన్ చేయండి
  • ఇప్పుడు కుడి ఎగువ మూలలో ఉన్న ప్రొఫైల్ సింబల్ పై నొక్కండి
  • 'లైవ్ షేరింగ్' ఆప్షన్ ను ఎంచుకోండి
  • అక్కడ, షేరింగ్ వ్యవధిని ఎంచుకోవడానికి 'షేర్ లొకేషన్'పై నొక్కండి. ఆపై మీరు షేర్ చేయాలనుున్న లింక్‌ను క్రియేట్ చేయవచ్చు.
  • షేరింగ్ ను ఆపివేయడానికి 'Sharing Via Link(షేరింగ్ వయా లింక్)', 'Stop'ను నొక్కండి.

గూగుల్ మ్యాప్స్ యూజర్స్ ను తమ లొకేషన్ ను యాప్ లోనే కాకుండా కమ్యూనికేషన్ కోస ఉపయోగించే ఇతర యాప్ ల ద్వారా కూడా పంచుకునేలా చేస్తుంది. 'లొకేషన్ హిస్టరీ' డిజేబుల్ చేసినపుడు కూడా ఈ యాప్ పని చేయడం గమనార్హం.

గమనించాల్సిన విషయాలు

  • భారతదేశంలో 13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు గూగుల్ మ్యాప్స్‌ అందుబాటులో లేదు.
  • ఇది Google Workspace డొమైన్ ఖాతాలకు సపోర్ట్ చేయదు.
  • Google Maps Go ప్లాట్‌ఫారమ్‌కి ఈ ఫీచర్‌కి యాక్సెస్ లేదు.