ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారతీయ సంస్థలు కూడా దూసుకుపోతున్నాయి. బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థ కోరోవర్ ఈ ఏడాది చాట్ జీపీటీ తరహాలో భారత్ జీపీటీని విడుదల చేసింది. 12 కంటే ఎక్కువ భారతీయ భాషలు, 120 విదేశీ భాషల్లోనూ ఇది సేవల్ని అందిస్తుంది. భారత్ జీపీటీ పనితీరు నచ్చిన గూగుల్ సంస్థ.. కోరోవర్ లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కోరోవర్ లో గూగుల్ 4బిలియన్ల పెట్టుబడులు పెడుతోంది. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భారత్ జీపీటీ దూసుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
దేశీయ స్టార్టప్ కంపెనీ కో రోవర్ రూపొందించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) భారతజీపీటీ లో 4 బిలియన్ల పెట్టుబడులు పెట్టాలని గూగుల్ నిర్ణయించింది. భారత్ జీపీటీని అధికారికంగా ప్రారంభించిన తర్వాత ఈ పెట్టుబడులు వస్తాయి. కోరోవర్ ఇప్పటికే గూగుల్ నుంచి 5లక్షల డాలర్ల ఈక్విటియేతర నిధులు పొందింది. ఈ నిధులు BharathGPT స్కేల్ అప్ చేయడానికి ఉపయోగించబతాయి. కోరోవర్ విలువ 8.5 మిలియన్ డాలర్లు కాగా.. వివిధ డొమైన్లలో క్లయింట్లను కలిగి ఉంది.