Google Most Searched Movies 2024: గూగుల్ సెర్చ్లో తెలుగు సినిమాల జోరు.. టాప్ 10లో మూడు మనవే

Google Most Searched Movies 2024: గూగుల్ సెర్చ్లో తెలుగు సినిమాల జోరు..  టాప్ 10లో మూడు మనవే

డిసెంబర్ తో 2024 ముగింపు దశకు వచ్చింది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద ఎన్నో సినిమాలు పలు రికార్డులు నెలకొల్పాయి. అందులో అనూహ్యంగా విజయాన్ని అందుకున్న సినిమాలు కూడా ఉన్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజై డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నవి కూడా ఉన్నాయి.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలు కూడా పాన్ ఇండియా రేంజ్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంటూ వందల కోట్లు వసూళ్లు చేస్తున్నాయి. ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరిగి  సినిమాలకు భాష, ప్రాంతీయ సరిహద్దులు లేవని మరోసారి  ఫ్రూవ్ చేశాయి.

ALSO READ | OTT Mythological Thriller: ఓటీటీలోకి తెలుగు మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

అలాగే జాతీయ అవార్డులు, ఫిల్మ్‌‌‌‌‌‌‌‌ఫేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో పాటు పలు ప్రెస్ట్రీజియస్ అవార్డులతోనూ  సౌత్  సినిమా దుమ్ము లేపుతోంది. ఇక ఈ ఏడాది జనవరి నుంచి మొదలు ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఎక్కువ ఆదరణ దక్కించుకున్న చిత్రాలు, బాక్సాఫీస్ వద్ద రూ.వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమాల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా గూగుల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన సినిమాల జాబితా కూడా చూసేద్దాం. 

టాప్ 10 గూగుల్ సెర్చెస్ సినిమాలు:

1. స్త్రీ2

2. కల్కి 2898 ఏడీ

3. 12th ఫెయిల్

4. లాపతా లేడీస్

5. హనుమాన్

6. మహారాజా

7. మంజుమ్మెల్ బాయ్స్

8. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్

9. సలార్

10. ఆవేశం

ఈ టాప్ 10 సినిమాల్లో మూడు తెలుగు సినిమాలు ఉండగా.. మూడు హిందీ మూవీస్, రెండు తమిళం, రెండు మలయాళం సినిమాలు నిలిచాయి. మరి ఆ మూడు తెలుగు సినిమాలేంటి? వాటి కలెక్షన్స్ కూడా ఓక లుక్కేద్దాం. 

కోట్లు కొల్లగొట్టిన ‘కల్కి’

టాప్ 2 లో ప్రభాస్ కల్కి2898AD. ఈ ఏడాది రూ.1200 కోట్ల కలెక్షన్స్‌‌‌‌‌‌‌‌తో  ‘కల్కి’ చిత్రం సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ రూపొందించిన  సైన్స్ ఫిక్షన్ డ్రామా  ఈ ఏడాది జూన్‌‌‌‌‌‌‌‌లో విడుదలై  ట్రెమండెస్ రెస్పాన్స్‌‌‌‌‌‌‌‌తోపాటు సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టింది. తొలిరోజు నుంచే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. వరల్డ్‌‌‌‌‌‌‌‌వైడ్‌‌‌‌‌‌‌‌గా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ సినిమాల్లో ఇది ఆరోవది కావడం విశేషం. వైజయంతీ మూవీస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అశ్వనీదత్ భారీ బడ్జెట్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘హనుమాన్‌‌‌‌‌‌‌‌’తో మొదలైన జైత్ర యాత్ర

టాప్ 5లో హనుమాన్. ఏదైనా సినిమాకు రూ.100 వసూళ్లు రావాలంటే స్టార్ హీరోనే అవసరం లేదని నిరూపించాడు తేజ సజ్జా. తను హీరోగా నటించిన ‘హనుమాన్’ ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై సక్సెస్ టాక్ తెచ్చుకోవడంతో పాటు దేశవ్యాప్తంగా రూ.256 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచింది. యంగ్ హీరోల్లో ఈ రేర్ ఫీట్ సాధించాడు తేజ. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కె నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

సలార్

టాప్ 9వ సలార్ మూవీ ఉంది. నిజానికి సలార్ మూవీ గతేడాది 2023 డిసెంబర్ లో రిలీజయింది. కానీ, ఈ ఏడాది కూడా గూగుల్ సెర్చ్ లో టాప్ 10లో నిలవడం గమనార్హం. ఇవే కాకుండా 2024లో పలు తెలుగు సినిమాలు వందకోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టాయి.

బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్: 

1.హనుమాన్‌‌‌‌‌‌‌‌

2.టిల్లు స్క్వేర్

3.కల్కి 2898 ఏడీ

4.సరిపోదా శనివారం

5.దేవర

6.లక్కీ భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

7.‘క’ చిత్రం

8.పుష్ప2