కస్టమర్లకు గూగుల్ పే బిగ్ షాక్.. ఇక బాదుడే..!

కస్టమర్లకు గూగుల్ పే బిగ్ షాక్.. ఇక బాదుడే..!

భారత్లో డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల్లో గూగుల్ పే (G Pay) స్థానం ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిజిటల్ పేమెంట్స్ చేస్తున్న కస్టమర్లలో 10 మందిలో 8 మంది జీపే.. అదేనండీ ఈ గూగుల్ పేనే (Google Pay) వాడుతున్నారు. అయితే.. ఇదే అదనుగా కస్టమర్లకు గూగుల్ పే బిగ్ షాక్ ఇచ్చింది. ఇకపై.. కన్వీనియన్స్ ఫీ పేరుతో బిల్ పేమెంట్లపై గూగుల్ పే కస్టమర్ల నుంచి ఛార్జీలను వసూలు చేయాలని డిసైడ్ అయింది.

బిల్ పేమెంట్స్పై చేసే ట్రాన్షాక్షన్ విలువను బట్టి 0.5 నుంచి 1 శాతం వరకూ ఈ కన్వీనియన్స్ ఫీజును గూగుల్ పే విధించనుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులతో గూగుల్ పే నుంచి చేసే బిల్ పేమెంట్లపై ఈ కన్వీనియన్స్ ఫీ వసూలు చేయనుంది. కరెంట్ బిల్లులు, గ్యాస్ బుకింగ్ చెల్లింపులు.. ఇలా పలు బిల్ పేమెంట్లను ఎక్కువ మంది గూగుల్ పే నుంచే చేస్తున్నారు.

ఇప్పటికే గూగుల్ పే నుంచి చేసే మొబైల్ రీఛార్జ్లపై సంవత్సరం నుంచి 3 రూపాయల కన్వీనియన్స్ ఫీ వసూలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే.. కస్టమర్లు యూపీఐతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్ల నుంచి డైరెక్ట్ పేమెంట్స్ చేస్తే ఈ బాదుడు నుంచి తప్పించుకోవచ్చు. గూగుల్ పే మాత్రమే కాదు ఫోన్ పే కూడా లెవీ ఛార్జీల పేరుతో డెబిట్, క్రెడిట్ కార్డుల నుంచి బిల్ పేమెంట్స్పై ఛార్జీలు విధించింది. పేటీఎం కూడా ఇదే బాటలో నడుస్తున్న విషయం విదితమే. భారత్లో యూపీఐ చెల్లింపులు అనూహ్యంగా పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో 12 వేల కోట్ల యూపీఐ చెల్లింపులు చేసినట్లు రిపోర్ట్ ఉంది. వీటిల్లో.. 4 వేల కోట్లు 2 వేల లోపు ట్రాన్షాక్షన్లే కావడం గమనార్హం.

Also Read :- ఫిక్స్ చేసిన టైంలోనే.. టాయిలెట్ బ్రేక్..మరీ ఇంత దారుణమా

మొబైల్‌‌‌‌ రీఛార్జ్‌‌‌‌ చేయాలంటే గూగుల్ పే, ఫోన్‌‌‌‌పే లేదా పేటీఎం ఓపెన్ చేయడం.. డన్ ..రీఛార్జ్‌‌‌‌ అయిపోతుంది. షాపులో సామాన్లు తీసుకున్నారా? క్యూఆర్‌‌ కోడ్ స్కాన్ చేయడం..డన్ పేమెంట్ అయిపోతుంది. కరోనా ఎఫెక్ట్ కావొచ్చు, ఇంకొకటి కావచ్చు మొబైల్ పేమెంట్ సర్వీస్‌‌‌‌లను అందిస్తున్న యాప్‌‌‌‌ల వాడకం విపరీతంగా పెరిగింది. ఒక్క స్టేట్‌‌‌‌ బ్యాంక్ మినహా ఇంక ఏ ఇతర బ్యాంకుకు కూడా గూగుల్‌‌‌‌ పే,  ఫోన్‌‌‌‌పేకి ఉన్నంత కస్టమర్ల బేస్‌‌‌‌ లేదనే చెప్పాలి. ఈ యాప్‌‌‌‌లకు రెవెన్యూ ఎలా వస్తోందని చాలా మంది ఆలోచిస్తుంటారు. ఫోన్‌‌‌‌పే, పేటీఎం, గూగుల్‌‌‌‌ పే వంటి యాప్‌‌‌‌ల ద్వారా ట్రాన్సాక్షన్ చేస్తే రివార్డులు, క్యాష్ బ్యాక్‌‌‌‌లు వస్తుంటాయి. రివార్డులు కూడా వేరే  కంపెనీ ప్రొడక్ట్‌‌‌‌పై డిస్కౌంట్‌‌‌‌గా ఇస్తున్నారు. ఈ డిస్కౌంట్‌‌‌‌ కోసం  కూడా కంపెనీలు ఖర్చు చేస్తాయి. కొన్ని సార్లు పేమెంట్ యాప్‌‌‌‌లతో కలిసి కంపెనీలు ఈ డిస్కౌంట్లను ఇస్తాయి. కస్టమర్లు యూపీఐ ద్వారా కాకుండా చేసే  ట్రాన్సాక్షన్‌‌‌‌పై  పేమెంట్ యాప్‌‌‌‌లకు కమీషన్ అందుతుంది.

పేమెంట్ సర్వీస్‌‌‌‌ కంపెనీలకు బ్రాండ్ల నుంచి కమీషన్‌‌‌‌లు వస్తాయి. అంటే పేటీఎం ద్వారా ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్ నెంబర్‌‌‌‌‌‌‌‌ రీఛార్జ్ చేస్తే, ఎయిర్‌‌‌‌‌‌‌‌టెల్‌‌‌‌ పేటీఎంకు కొంత కమీషన్‌‌‌‌గా ఇస్తుంది. కస్టమర్లు బ్రాడ్‌‌‌‌బ్యాండ్‌‌‌‌, డీటీహెచ్‌‌‌‌ వంటి రీఛార్జ్‌‌‌‌లు చేసినప్పుడు కూడా మొబైల్ పేమెంట్ సర్వీస్‌‌‌‌ కంపెనీలకు కమీషన్ అందుతుంది. కంపెనీలతో డైరెక్ట్‌‌‌‌గా ఈ యాప్‌‌‌‌లు లింక్ అవుతాయి కాబట్టి కమీషన్ల కింద పెద్ద మొత్తంలో రెవెన్యూ అందుతుంది.పేమెంట్ సర్వీసెస్‌‌‌‌ యాప్‌‌‌‌లలో ఇప్పటికీ మొబైల్‌‌‌‌, బ్రాడ్ బ్యాండ్‌‌‌‌, డీటీహెచ్‌‌‌‌ రీఛార్జ్‌‌‌‌లదే హవా. యాప్‌‌‌‌లు కస్టమర్లకిచ్చే క్యాష్ బ్యాక్‌‌‌‌లను తగ్గించుకుంటే రెవెన్యూ మిగులుతుంది. ఈ క్యాష్ బ్యాక్‌‌‌‌లను కూడా కంపెనీలు తమ అకౌంట్‌‌‌‌ బుక్‌‌‌‌లో మార్కెటింగ్ ఖర్చులుగా లిస్ట్ చేస్తాయి తప్ప రెవెన్యూ నష్టపోయామని రికార్డ్ చేయవని గుర్తుంచుకోవాలి.