న్యూఢిల్లీ: బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే నగల షాపుకే వెళ్లాల్సి నవసరం లేదు. డిజిటల్ వ్యాప్తి పెరుగుతున్నా కొద్దీ.. బంగారం కూడా మన చేతుల్లోకే వచ్చేస్తోంది. ఇప్పటికే పేటీఎం, ఫోన్‌పే ఆఫర్ చేస్తున్న మాదిరి గూగుల్ డిజిటల్ పేమెంట్స్ యాప్ గూగుల్ పే కూడా బంగారం కొనుగోళ్లకు సరికొత్త సర్వీసును త్వరలోనే లాంచ్ చేయబోతుంది. ఈ సరికొత్త సర్వీసుతో గూగుల్ పే యూజర్లు యాప్ నుంచే డైరెక్ట్‌గా బంగారాన్ని కొనేయొచ్చు. ఈ ఆప్షన్‌ను ప్రవేశపెట్టడంతో గూగుల్ కూడా వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్‌లోకి అడుగుపెట్టినట్టవుతుందని రిపోర్టులు చెబుతున్నాయి . అయితే ‘గూగుల్ పే’లో బంగారం కొనాలంటే ముందుగా ‘గోల్డ్ అకౌంట్ ’కు సబ్ స్క్రయిబ్ అవ్వాలి. ఇది గోల్డ్‌తో లింక్ అయ్యే సేవింగ్స్ స్కీమ్. ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం బంగారాన్ని కొనేసుకుని, దాన్ని వర్చువల్‌గా అట్టిపెట్టుకు ని అవసరమైనప్పుడు గోల్డ్ కాయిన్లు లేదా నగదు రూపంలోకి రిడీమ్ చేసుకోవచ్చు.
పేటీఎం, ఫోన్‌పేలు రెండూ ఇప్పుడు ఇదే మాదిరి సర్వీసులను ఆఫర్ చేస్తున్నాయి . గూగుల్‌కు మాత్రమే ఈ సర్వీసులు లేవు. ఈ సర్వీసులన్నీ ఎంఎంటీసీ సారథ్యంలో నడుస్తాయి. ఈ సర్వీసులు లాంచ్ చేసేందుకు గోల్డ్ రిఫైనరీ ఎంఎంటీసీ– పీఏఎంపీతో గూగుల్ భాగస్వామ్యం కుదుర్చుకుం దని బిజినెస్ ఇంటెలిజెన్స్ ప్లాట్ ఫా మ్ వ్యవస్థాపకుడు వివేక్ దురై చెప్పారు. గోల్డ్ అకౌంట్ ను యాక్టివేట్ చేసుకోవాలంటే, యూజర్లు కేవైసీ నిబంధనల ప్రకారం వివరాలన్నింటిన్నీ పూర్తి చేయాలి.