ఆన్ లైన్ పేమెంట్ ప్లాట్ ఫారమ్ గూగుల్ పే.. డిజిటల్ లావాదేవీలను మరింత సులభతరం చేసేందుకు తాజాగా యూపీఐ లైట్ ను అందుబాటులోకి తెచ్చింది. ఇది యూపీఎన్ పిన్ అవసరం లేకుండానే స్మాల్ ట్రాన్ సాక్షన్స్ చేసేలా యూజర్స్ కు అందుబాటులో ఉంది.
Google Pay యాప్‌లో యూపీఐ (UPI) లైట్ వ్యాలెట్‌ని క్రియేట్ చేయవచ్చు. దీన్ని ఒకేసారి రూ.2వేలతో లోడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ రూ.2వందల వరకు తక్షణ UPI లావాదేవీలను సులభతరం చేస్తుంది.
Google Payలో UPI Liteని ఎలా యాక్టివేట్ చేయాలంటే..
- Google Pay యాప్‌ను ఓపెన్ చేయండి
- ఎగువ కుడివైపున ఉన్న మీ ప్రొఫైల్ పిక్ పై క్లిక్ చేయండి
- పిన్ ఫ్రీ UPI లైట్ ఆప్షన్ ను ఎంచుకోండి
- మీరు యాడ్ చేయాలనుకుంటున్న మొత్తాన్ని నమోదు చేయండి (రూ.2వేల వరకు లోడ్ చేయవచ్చు)
- మీ UPI పిన్‌ని టైప్ చేయండి
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, NPCIతో ఒప్పందం..
భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెప్టెంబర్ 2022లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన డిజిటల్ చెల్లింపు సేవ అయిన UPI లైట్‌ని ప్రారంభించింది.