గుడ్న్యూస్..ఇకపై గూగుల్ పేలో AI ..వాయిస్ కమాండ్తో చెల్లింపులు

గుడ్న్యూస్..ఇకపై గూగుల్ పేలో AI ..వాయిస్ కమాండ్తో చెల్లింపులు

డిజిటల్ పేమెంట్స్ ప్రపంచంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ ఫాం గూగుల్ పే గణనీయమైన మార్పులు తీసుకొస్తోంది. కొత్తగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పవర్డ్ ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో భాషిణి ఏఐ అనే ప్రాజెక్టు ద్వారా డిజిటల్ పేమెంట్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ లావాదేవీలను మరింత ఈజీగా మార్చడం, ఫ్రెండ్లీ యూజర్ పేమెంట్స్ ను అందించడం లక్ష్యంగా ఏఐ ఫీచర్ ను అందుబాటులోకి తెస్తోంది. 

గూగుల్ పే AI వాయిస్ ఫీచర్.. 

ఇది నిరక్ష్యరాస్యులైన కస్టమర్లకు బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడున్న ఆన్ లైన్ పేమెంట్స్ సిస్టమ్ తో చదువుకోని వారికి ఇబ్బంది. అలాంటి వారికి AI వాయిస్ ఫీచర్  చాలా ఉపయోగం..

స్థానిక భాషల్లో యూపీఐ పేమెంట్స్

AI వాయిస్ ఫీచర్ ద్వారా స్థానిక భాషను ఉపయోగించి  ఆన్ లైన్ పేమెంట్స్ చేయొచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం, Google కలిసి భాషిణి AI ప్రాజెక్ట్‌లో భాగంగా AI వాయిస్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నారు.దీని ద్వారా ప్రజలు స్థానిక భాషలలో చెల్లింపులు చేయడానికి వీలు కల్పిస్తుంది. 

ఆన్ లైన్ పేమెంట్స్ భద్రతకోసం.. 

లావాదేవీలను సులభతరం చేయడంతోపాటు దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలను ఎదుర్కోవడానికి Google మెషిన్ లెర్నింగ్, AI టెక్నాలజీలను కూడా ఉపయోగిస్తోంది. ఆన్ లైన్ మోసాలు, బెదిరింపులు వంటి సైబర్ నేరాలను అరికట్టడంతో, కస్టమర్లను సురక్షితంగా ఉంచడంతో ఈ కొత్త AI వాయిస్ ఫీచర్ కీలక పాత్ర పోషించనుంది. 

AI వాయిస్ ఫీచర్ కస్టమర్లకు ఆన్ లైన్ పేమెంట్స్ సులభతరం చేయడమే కాకుండా డిజిటల్ చెల్లింపుల సమయంలో భద్రతను అందించడం ద్వారా Google Pay తన నిబద్ధతను హైలైట్ చేస్తుంది. AI వాయిస్ ఫీచర్  ప్రారంభ తేదీ,ఎలా పనిచేస్తుందనే దానిపై కంపెనీ వివరాలు త్వరలో ప్రకటించనుంది.