
Google తన మిడిల్ రేంజ్ కొత్త స్మార్ట్‌ఫోన్ Pixel 9a ను ఇండియాలో లాంచ్ చేసేందుకు సిద్దమైంది.Google కంపెనీ Pixel A-సిరీస్‌లో భాగం అయిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధరతో, ఫ్లాగ్ షిప్ ఫీచర్లకు ఫేమస్. ఈ హ్యాండ్ సెట్ ఏప్రిల్ 16న విడుదల చేసేందుకు గూగుల్ కంపెనీ డేట్ ఫిక్స్ చేసింది.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.3-అంగుళాల యాక్టువా డిస్‌ప్లే, టెన్సర్ G4 ప్రాసెసర్, 48MP ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్-కెమెరా సిస్టమ్ ఉన్నాయి. ఇది ఏడేళ్ల పాటు అండ్రాయిడ్ 15 అప్డేట్స్ అందిస్తుంది. 5G కనెక్టివిటీకి సపోర్టు చేస్తుంది.
గూగుల్ పిక్సెల్ 9a స్పెసిఫికేషన్లు
గూగుల్ పిక్సెల్ 9ఎ 6.3-అంగుళాల యాక్టువా డిస్‌ప్లేతో 2,700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ టెన్సర్ G4 ప్రాసెసర్‌తో 8GB RAM ,256GB వరకు నిల్వతో వస్తుంది.ఈ హ్యాండ్సెట్లో కాంపోజిట్ మ్యాట్ గ్లాస్ బ్యాక్ ,శాటిన్ మెటల్ ఫ్రేమ్‌తో తయారు చేశారు. ఛార్జింగ్ విషయంలో ఈ డివైజ్ బెటర్ వన్. 23W వైర్డ్ ఛార్జింగ్ ,Qi వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,100mAh బ్యాటరీ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ ప్రూఫ్ కోసం IP68 రెసిస్టెన్సీ రేటింగ్‌తో లభిస్తుంది.
ఇక ఈ స్మార్ట్ ఫోన్ అండ్రాయిడ్15 సిస్టమ్ తో పనిచేస్తుంది. ఏడు సంవత్సరాల పాటు OS అప్డేట్స్, సెక్యూరిటీ, పిక్సెల్ డ్రాప్ అప్డేట్స్ అందిస్తుంది.
ఇక కెమెరా విషయానికొస్తే.. బ్యాక్ సైడ్ 48MP మెయిన్ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్ష్ తో కూడిన డ్యూయెల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది.సెల్ఫీకోసం పిక్సెల్ 9a f/2.2 ఎపర్చర్‌తో 13MP కెమెరాను ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9a ద్వారా కంపెనీ A-సిరీస్‌కి మాక్రో ఫోకస్‌ను పరిచయం చేసింది. ఈ డివైజ్ లో యాడ్ మీ, బెస్ట్ టేక్, మ్యాజిక్ ఎడిటర్, నైట్ సైట్, ఆస్ట్రోఫోటోగ్రఫీ, పనోరమా విత్ నైట్ సైట్, మ్యాజిక్ ఎరేజర్ వంటి AI-ఆధారిత కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీ ఫీచర్లు కూడా ఉన్నాయి.ఈ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ కు చెందిన జెమిని AI అటాచ్ చేశారు. మ్యాప్స్, క్యాలెండర్ ,యూట్యూబ్ గూగుల్ యాప్‌లలో AI అసిస్టెన్సీని అందిస్తుంది. జెమిని లైవ్ సంభాషణ ,జెమిని అడ్వాన్స్‌డ్‌తో వీడియో ,స్క్రీన్-షేరింగ్ కెపాసిటీతో సహా అద్బుతమైన ఫీచర్లు ఉన్నాయి.
అదనంగా AI-ఆధారిత ఫీచర్లలో సర్కిల్ టు సెర్చ్ ,పిక్సెల్ స్టూడియో ఉన్నాయి. వీటితో పాటు కార్ క్రాష్ డిటెక్షన్, థెఫ్ట్ డిటెక్షన్,ఫైండ్ మై డివైస్ ద్వారా లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. స్క్రీన్ టైమ్ కంట్రోల్స్, Google ఫ్యామిలీ లింక్ ద్వారా స్కూల్ టైమ్ మోడ్ వంటి ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫీచర్లు కూడా ఉన్నాయి.
ఇక కనెక్టివిటీ విషయానికొస్తే.. ఫోన్ 5G కనెక్టివిటీ, Wi-Fi 6E, బ్లూటూత్ 5.3 ,NFCకి సపోర్టు చేస్తుంది. ఇది డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్,ఫేస్ అన్‌లాక్‌ను కలిగి ఉంది. ఈ డివైజ్ లో ఛార్జింగ్ డేటా బదిలీ కోసం USB టైప్-C 3.2తో డ్యూయల్ స్పీకర్లు,రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి.
Google కంపెనీ Pixel A-సిరీస్‌లో భాగం అయిన ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర రూ. 49, 999 లో లభిస్తుంది. ఫ్లాగ్ షిప్ ఫీచర్లకు ఫేమస్. ఈ హ్యాండ్ సెట్ ఏప్రిల్ 16నుంచి ఇండియాలో అందుబాటులో ఉంటుంది.