మీ ఫొన్ లో ఈ యాప్ లు ఉన్నాయా? డిలెట్ చేయాలని గూగుల్ వార్నింగ్

మీ ఫొన్ లో ఈ యాప్ లు ఉన్నాయా? డిలెట్ చేయాలని గూగుల్ వార్నింగ్

మీ ఫోన్ లో ఉండే కొన్ని యాప్స్ మీకు తెలియకుండానే మీ ఫోన్ లోని ప్రైవసీ డేటాని చోరీ చేస్తాయి. మీ మొబైల్ డేటా సురక్షితమేనా అని మీరెప్పుడైనా ఆలోచించారా? గూగుల్ కొన్ని ఆంధోళనకర విషయాలను వెల్లడించింది.  మాల్వేర్ ప్రొటెక్షన్ అండ్ ఇంటర్నెంట్ సేఫ్టీ ESET చేసిన ఓ పరిశోధనలో 12 డెంజర్స్ యాప్ ల్లో వజ్ర స్పై (VajraSpy) అనే మాల్వేర్ ఉన్నట్లు తెలిపింది. ఈ మాల్వేర్ వ్యక్తిగత సమాచారాన్ని, మన ఫోన్ కాల్స్ రికార్డ్ చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే వీటిలో 6 యాప్ లు గూగుల్ ప్లే స్టోర్ లో గత రెండు సంవత్సరాలుగా ఉన్నాయి. తాజాగా వాటిని గుగూల్ సర్వీస్స్ నుంచి తొలగించినప్పటికీ ఇప్పటికే ఆ యాప్ లను డౌన్లోడ్ చేసుకున్న వారి డేటా డేంజర్ జోన్ లో ఉన్నట్లే. ఇంకా ఈ యాప్స్ ఇతర యాప్ స్టోర్ లో కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. 


ఈ ఆరు యాప్ లు మీరు వాడుతున్నట్లేతే వెంటనే డిలెట్ చేయమని గూగుల్ ప్లో స్టోర్ కోరుతుంది. అవి ఏంటంటే..

క్విక్ చాట్ Quick Chat
లెట్స్ చాట్ Let’s Chat
ప్రైవీ చాట్ Privee Talk
చిట్ చాట్  Chit Chat
మీట్ మీ MeetMe
రఫకత్ Rafaqat