డెస్క్టాప్పై గూగుల్ సెర్చ్ లో న్యూస్‌కు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్ తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. డెస్క్టాప్పై కొత్త డిజైన్‌తో న్యూస్ ట్యాబ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పింది. కొత్తగా రానున్న డిజైన్‌లో పబ్లిషర్‌కు సంబంధించిన వివరాలు మరింత స్పష్టంగా ఉంటాయని తెలిపింది. వివిధ కేటగిరీలకు చెందిన ఆర్టికల్స్ ఆర్గనైజేషన్ కూడా సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని, యూజర్లు తమకు కావాల్సిన న్యూస్‌ను సులభంగా ఎంపిక చేసుకోవచ్చని ట్విట్టర్లో వెల్లడించింది.
ఇప్పటివరకు న్యూస్ అన్నీ ఒక లిస్టులాగా మాత్రమే కనిపించేవి. అయితే కొత్త ట్యాబ్‌లో కార్డ్ ఫార్మాట్లో కనిపిస్తాయి. హెడ్‌లైన్స్, పబ్లిషర్ వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఒక అంశానికి సంబంధించిన న్యూస్ అన్నీ ఒకే చోట వివరంగా కనిపిస్తాయి. దీనివల్ల యూజర్లు ఏ వార్త గురించైనా లోతైన సమాచారం తెలుసుకోగలుగుతారు. మరో రెండు వారాల్లో ఈ న్యూస్ ట్యాబ్ అందరికీ అందుబాటులోకి వస్తుంది.