గూగుల్ ప్లేస్టోర్ నుంచి 300 యాప్లు తొలగింపు..6కోట్ల మంది యూజర్ల డేటా చోరి

గూగుల్ ప్లేస్టోర్ నుంచి 300 యాప్లు తొలగింపు..6కోట్ల మంది యూజర్ల డేటా చోరి

గూగుల్ ప్లేస్టోర్ నుంచి హానికరమైన యాప్లను తొలగించింది. కస్టమర్ల డేటాను దొంగిలిస్తున్న 300 యాప్లను రిమూవ్ చేసింది. ఈ యాప్లు ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించి రహస్యంగా యూజర్ల డేటాను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ యాప్లను దాదాపు 6కోట్ల మంది ఇన్స్టాల్ చేసుకున్నారు. 

ఈ యాప్లు ఎందుకు ప్రమాదకరం..?

IAS థ్రీట్ ల్యాబ్ పరిశోధకుల రిపోర్టు ప్రకారం.. ఈ యాప్ లు Vapor అని పిలువబడే పెద్ద ఫ్రాడ్ ఆపరేషన్లలో భాగంగా ఉన్నాయి. ఇవి వ్యక్తిగత సమాచారం దొంగిలించడమే కాకుండా ఫిషింగ్ అటాక్స్ ద్వారా క్రెడిట్ కార్డు సమాచారం బహిర్గతం చేసేలా కస్టమర్లను మోసం చేస్తుందని తెలుస్తోంది. దీంతో పాటు 2కోట్ల నకిలీ ప్రకటనలో అటు యూజర్లను, ఇటు అడ్వర్టైజర్లను మోసం చేసిందని రిపోర్టులు చెబుతున్నాయి. 

ALSO READ | IPL 2025 కోసం బెస్ట్ రీచార్జ్ ప్లాన్.. 90రోజుల జియో హాట్స్టార్ సబ్ స్క్రిప్షన్ ఫ్రీ

స్మార్ట్ఫోన్ యూజర్లు ఏంచేయాలి..? 

మీ హ్యాండ్సెట్ Android 13OS లో నడుస్తున్నట్లయితే వెంటనే లేటెస్ట్ వెర్షన్కు అప్డేట్ చేయాలి. ఇలా చేస్తే డేటాకు ఎలాంటి ఢోకా ఉండదు. మీ స్మార్ట్ ఫోన్లో ఇన్స్టాల్ చేసిన యాప్లను చెక్ చేసుకోవాలి. ఏవైనా అనుమానాస్పద యాప్లు ఉంటే వెంటనే తొలగించాలి. 

యాప్‌లను డౌన్‌లోడ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి..

ఫ్యూచర్లో ఇటువంటి ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు నమ్మకమైన డెవలపర్ల నుంచి యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలి. సమీక్షలు చదవాలి. ఇన్‌స్టాల్ చేసే ముందు యాప్ అనుమతులను చెక్ చేయాలి. Google  లేటెస్ట్ చర్య పెరుగుతున్న ఫ్రాడ్ యాప్లముప్పును హైలైట్ చేస్తుంది. కొత్త అప్లికేషన్లను ఇన్‌స్టాల్ చేసేటప్పుడు యూజర్లు జాగ్రత్తగా ఉండటం చాలా కీలకం.