గూగుల్ సెర్చ్ బార్ లో ఆసక్తికర ఫీచర్లు..!

గూగుల్ సెర్చ్ బార్ లో ఆసక్తికర ఫీచర్లు..!

ఏ బ్రౌజర్​లో అయినా గూగుల్​ సెర్చ్​ బార్​ తప్పనిసరి. ఆండ్రాయిడ్​ మొబైల్స్​లో అయితే హోమ్​ స్క్రీన్​ మీదే గూగుల్​ సెర్చ్​ బార్​ కనిపిస్తుంది. గూగుల్ ను ఏదైనా సెర్చ్​చేసేందుకు, వాయిస్​ కమాండ్​ ఇచ్చేందుకు మాత్రమే వాడతాం. అయితే గూగుల్​ సెర్చ్​ బార్​కు సంబంధించి కొన్ని ఆసక్తికర ఫీచర్లున్నాయి. తక్కువ మందికి తెలిసిన అలాంటి కొన్ని ఫీచర్లపై ఓ లుక్కేయండి.

టిక్–టాక్–టో
సిస్టమ్​పై వర్క్​ చేసేటప్పుడు బోర్​ కొడుతోందా? కాస్త రిలాక్స్​ అవ్వాలనుకుంటే గూగుల్​ సెర్చ్​ బార్​లో టిక్–టాక్–టో ( Tic Tac Toe) అని టైప్​ చేయండి. సెర్చ్​ బార్​ కింద చిన్న మైండ్​ గేమ్​ కనిపిస్తుంది. దీనిలో రకరకాల ఆప్షన్లుంటాయి. మీ మూడ్​ను బట్టి గేమ్​ సెలెక్ట్​ చేసుకుని ఆడేయండి.

హ్యాండీ సెర్చ్
మీ ఆండ్రాయిడ్​ మొబైల్​లో గూగుల్​సెర్చ్​ చేయాలంటే ప్రత్యేకంగా సెర్చ్​ బార్​ను క్లిక్​ చేయక్కర్లేదు. హోం బటన్​ను కొద్ది సేపు ప్రెస్​ చేస్తే గూగుల్​ సెర్చ్​ ఆప్షన్​ కనిపిస్తుంది. వాటిలోంచి మీకు కావాల్సింది సెలెక్ట్​ చేసుకోవచ్చు.

టైమర్
ఏదైనా పని చేసేటప్పుడు కొన్నిసార్లు టైమర్​ అవసరం అవుతుంది. ఫిక్స్​డ్​ టైమ్​ సెట్​ చేసుకుని ఆలోపు పని పూర్తి చేయాలనుకుంటే ప్రత్యేకంగా యాప్​ అవసరం లేదు. గూగుల్​సెర్చ్​ ఇంజిన్​లో ‘టైమర్’ అని టైప్​ చేస్తే చాలు. ఐదు నిమిషాల టైమర్​ కనిపిస్తుంది. లేదా కావాల్సిన టైమ్​ సెట్​ చేసుకోవచ్చు.

జీమెయిలిఫై
జీ మెయిల్​ కాకుండా నాన్​ ఈ మెయిల్స్​అయిన యాహూ, హాట్​లుక్​ వంటి వేరువేరు అకౌంట్లు వాడుతున్నారా? అయితే వాటికి వచ్చిన మెయిల్స్​ను జీమెయిల్​లోనే చూడొచ్చు. జీ మెయిల్​ ఓపెన్​ చేసి, సెట్టింగ్స్​ ద్వారా జీమెయిలిఫై చేసుకుంటే అన్ని నాన్​ జీమెయిల్​ అకౌంట్లను ఒక్క చోట నుంచే చెక్​చేసుకోవచ్చు.

సౌండ్​ సెర్చ్​ యాప్
ఏదైనా ఒక పాట లేదా బ్యాక్​గ్రౌండ్​ మ్యూజిక్​ వంటివి విన్నప్పుడు దాని గురించి వివరాలు (సినిమా పేరు, సింగర్, మ్యూజిక్​ డైరెక్టర్)  కొన్నిసార్లు తెలియకపోవచ్చు. అలాంటప్పుడు ‘గూగుల్​సౌండ్​ సెర్చ్​ యాప్’ వాడొచ్చు. ఈ యాప్​ ఓపెన్​ చేసి సాంగ్​ ప్లే చేస్తే ఆ పాట వివరాలు కనిపిస్తాయి.

ఆస్క్యూ/టిల్ట్
గూగుల్​లో మీ ఫ్రెండ్స్​ ఏదైనా సెర్చ్​చేస్తుంటే వాళ్లకు ఆస్క్యూ/టిల్ట్ (Askew/Tilt) లింక్​ పంపండి. దాన్ని క్లిక్​ చేస్తే వాళ్లు షాక్​ అవ్వడం ఖాయం. ఎందుకంటే స్క్రీన్​పై గూగుల్​ సెర్చ్​ పేజ్​ వంగిపోయి కనిపిస్తుంది. కావాలంటే మీరూ ట్రై చేయొచ్చు.