సెక్యూరిటీ పరంగా యూజర్లకు భద్రత కల్పించేందుకు గూగుల్ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులో తెస్తూనే ఉంది.ఇటీవల ఆర్థికపరమైన లావాదేవీలలో మోసాలను అడ్డుకునేందుకు గూగుల్గట్టి చర్యలు తీసుకుంటోంది. గతేడాది రూ.13వేల కోట్ల ఫైనాన్సియల్ స్కామ్ లను గుర్తించింది. 41 మిలియన్ల ఫ్రాడ్ లెంట్లావాదేవీలను నిలిపివేసింది.
తాజాగా మోసపూరిత సైట్లను గుర్తించేందుకు తాజాగా కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వెబ్ సైట్ చట్టబద్దమైనదా.. కాదా? అని నిర్ధారించుకునేందుకు త్వరలో గూగుల్ సెర్చ్‌లో బ్లూ వెరిఫైడ్ చెక్ మార్క్ ద్వారా గుర్తించనుంది. ఇది ఫ్రాడ్లెంట్ సైట్లను అడ్డుకునేందుకు యూజర్లకు సాయపడుతుంది.
గూగుల్సెర్చ్బ్లూ వెరిఫైడ్చెక్మార్క్..
తాజా నివేదికల ప్రకారం.. మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, అమెజాన్ వంటి పెద్ద కంపెనీల అఫిషియల్ సైట్ల లింక్‌కు బ్లూ చెక్ మార్క్‌ను చూపిస్తుంది. అయితే ఇది అందరి యూజర్లకు అందుబాటులో ఉండదు. ప్రస్తుతం ఈ ఫీచర్ టెస్టింగ్దశలో ఉంది.
బ్లూ వెరిఫైడ్చెక్మార్క్ ఎలా పనిచేస్తుంది..?
ఇది Gmail లో కనిపించే గూగుల్ బ్రాండ్ఇండికేటర్స్ ఫర్ మేసేజ్ ఐడెంటిఫికేషన్(BIMI) ఫీచర్ వలె పనిచేస్తుంది. కంపెనీల లోగోలను దృవీకరిస్తుంది. మరోవైపు వాయిస్ మానిప్యులేషన్ ద్వారా వ్యక్తులను మోసగించే సైబర్ మోసాల కేసులు ఇటీవల పెరిగిని విషయం తెలిసిందే. వాయిస్ స్పూఫింగ్ సైబర్ నేరాలను కంట్రోల్ చేసేందుకు టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) కొత్త వ్యవస్థను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఫేక్ వాయిస్ కాల్స్ కు చెక్ పెట్టడం దీని లక్ష్యం.