Google Layoffs:10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్ సుందర్ పిచాయ్

Google Layoffs:10 శాతం ఉద్యోగులను తొలగిస్తున్న గూగుల్ సుందర్ పిచాయ్

గ్లోబల్ టెక్ జెయింట్ గూగుల్ లేఆఫ్స్ ప్రకటించింది.గత కొంతకాలంగా టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల మాట వినిపించనప్పటికీ తాజాగా గూగుల్ సీఈవో  సుందర్ పిచాయ్ శుక్రవారం (డిసెంబర్ 20) నాడు తన సిబ్బందితో కొంతమందిని తొలగిస్తున్నట్లు హింట్ ఇచ్చారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన ఉద్యోగుల్లో 10శాతం మందిని తొలగించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా మేనేజర్, డైరెక్టర్ , వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానాల్లో ఉన్న ఉద్యోగులపై కోతలు ఉంటాయని బుధవారం జరిగిన గూగుల్ సర్వ సభ్య సమావేశంలో పిచాయ్ సూచించినట్లు తెలుస్తోంది. 

గూగుల్ ప్రతినిధి తెలిపిన వివరాల ప్రకారం.. మేనేజర్, డైరెక్టర్ , వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక స్థానాలనుంచి పోజిషన్లు తగ్గించబడవచ్చు లేదా మరికొందరు ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది.  

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పోటీని ఎదుర్కొనేందుకు, OpenAI లాంటి ప్రత్యర్థుల్లో వేగవంతమైన మార్పులు గూగుల్ సెర్చింగ్ కు గట్టి పోటీ ఉన్న క్రమంలో ఉద్యోగుల్లో ఈ మార్పులు ఉండవచ్చని గూగుల్ ప్రతినిధి చెప్పారు. గూగుల్ గతేడాది ఆదాయంలో అత్యధికంగా 57 శాతం వాటా గూగుల్ సెర్చ్ ఇంజిన్ దే. 

Also Read :- ఈ ఏడాది 18 ఓటీటీలపై బ్యాన్‌

మరోవైపు గూగుల్ ఉత్పాదక AI లో కొత్త మోడల్స్ ను పరిచయం చేస్తూనే ఉంది. తాజాగా డిసెంబర్ ప్రారంభంలో జెమిని 2.0 లేటెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ని  ప్రారంభించింది. ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకునేవిధంగా రూ ఈ కొత్త మోడల్ AI ని రూపొందించారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చరిత్రలో కొత్త శకానికి నాంది పలుకుతుందని పిచాయ్ చెబుతున్నారు. 

2022 సెప్టెంబర్ నుంచి లేఆఫ్స్ పరంపర కొనసాగిస్తోంది..కంపెనీ నిర్వహణ, కొత్త టెక్నాలజీ అందిపుచ్చుకోవడడం, ఇతర పోటీదారులను ఎదుర్కోవడం వంటి కారణాలతో కంపెనీ వర్క్ ఫోర్స్ లో  కొంత తగ్గిస్తూ వస్తోంది. 2023లో అత్యధికంగా 12వేలమంది ఉద్యోగులు అంటే కంపెనీ వర్క్ ఫోర్స్ లో 6.4 శాతం తొలగించింది. 

2024జనవరిలో దాని గ్లోబల్ అడ్వర్టైజ్‌మెంట్ల బృందం నుంచి కొన్ని వందల పొజిషన్లు తొలగించడం, జూన్‌లో దాని క్లౌడ్ యూనిట్‌లో మరో 100 ఉద్యోగాలను తొలగించడంతో సహా ఈ ఏడాది తొలగింపుల్లో ఇది నాల్గవది.