రోజుకు ఒక్క గంటే పని చేస్తాడు.. జీతం రూ. కోటి 20 లక్షలు

రోజుకు ఒక్క గంటే పని చేస్తాడు.. జీతం రూ. కోటి 20 లక్షలు

సాధారణంగా ఏ కంపెనీలో అయినా ఉద్యోగులు.. కనీసం రోజుకు 8 గంటలు పనిచేయాల్సిందే. లేదంటే వారి జీతంలో కోత తప్పదు. ఒక్కోసారి అంతకంటే ఎక్కవ సేపు పనిచేయాల్సి రావచ్చు. అయినా వచ్చే జీతంలో ఎలాంటి మార్పు ఉండదు. అయితే, ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి.. రోజుకు 1 గంట మాత్రమే పని చేస్తూ ఏడాదికి రూ.కోటి కోటి 20 లక్షల జీతాన్ని అందుకుంటున్నాడు. మీరు నమ్ముకున్నా.. ఇది నిజమే. అతనే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.

దేవాన్‌ అనే ఉద్యోగి గూగుల్‌లోని కోడింగ్‌ విభాగంలో ఇంజినీర్‌గా వర్క్‌ చేస్తున్నాడు. రోజూ ఉదయాన్నే లేవటం.. స్నానపానాదులు ఆచరించటం.. బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఒక గంట కంపెనీ కోసం పనిచేయటం.. ఇదే ఇతని దినచర్య. ఒకవేళ పని ఎక్కువగా ఉంటే, మధ్యాహ్నం వరకు దానిని కొనసాగిస్తాడు. లేదంటే తన స్టార్టప్ కోసం వర్క్ చేసుకుంటాడు. ఇలా వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేస్తాడు. అందుకుగానూ అతను కంపెనీ నుంచి ఏటా  తీసుకుంటున్న జీతం ఎంతో తెలుసా..? అక్షరాలా 1.5 లక్షల డాలర్ల(భారత కరెన్సీలో రూ.1.2 కోట్లు). అంతేకాదు బోనస్‌లు అందుకుంటున్నాడు.

గూగుల్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులందరూ ఖచ్చితంగా ఫుల్ టైం వర్క్ చేయాల్సిందే. కాకపోతే డెవన్ విషయంలో మాత్రం అందుకు మినహాయింపు ఉందట. అతను గంట సమయమే పనిచేసినా.. క్వాలిటీ వర్క్ చేస్తాడట. ఏ పనైనా, ఎంత వర్క్ ఇచ్చినా తక్కువ సమయంలోనే పూర్తి చేస్తాడట. పైగా, అతను రిపోర్టింగ్ మేనేజర్‌కు కూడా పూర్తిగా సహకరిస్తాడని ఫార్చూన్ వెల్లడించింది.

"ఎక్కువ సేపు(గంటలు) పనిచేయాలనే ఒత్తిడి నాకు లేదు. ఒకవేళ అలా చేయాలనుకుంటే స్టార్టప్‌ కంపెనీలో ఉండేవాడిని. నేను కూడా వేల మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లలో ఒకడినే. కాకపోతే నానా వరకు కష్టపడకుండా వేగంగా పని చేసేందుకే ఇష్టపడతాను.." అని ఈ యువ ఇంజినీర్ చెప్తున్నాడు. ఏదేమైనా ఈ ఇంజినీర్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద వార్త అయిపోయాడు.