గూగుల్ తన ఇమేజ్ జనరేటర్ ను AI చాట్ బార్డ్ కి జోడించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇది బార్డ్ తో ఇమేజ్ లను ఎలా సృష్టించవచ్చో చూపుతుంది. బార్డ్ తో ఇమేజ్ జనరేషన్ ఇమేజెన్ కోసం గూగుల్ టెక్ట్స్ టు ఇమేజ్ డిఫ్యూజన్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. ఇది సాధారణ టూల్స్ మాదిరిగానే వినియోగదారులు వారి ఊహలను చాట్ బాట్ కు పదాలలో వివరించడం ద్వారా ఇమేజ్ లను రూపొందించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ సాధనం Google ఇమేజెన్ ఫ్యామిలీ మోడల్స్ ద్వారా అందించబడుతుంది.
దీనికంటే ముందు Google Maps లో కొత్త ఫీచర్ ను జోగించింది గూగుల్. ఇది టన్నెల్స్, ఇతర శాటిలైట్ డెడ్ జోన్ లలో నావిగేట్ చేసేందుకు కస్టమర్లకు ఉపయోగపడుతుంది. బ్లూటూత్ బీకాన్ లను ఇదిసపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మ్యాప్స్ లో ఇది అందుబాటులో ఉంది. ఇంకా iOS వెర్షన్లలో అందుబాటులోకి రాలేదు.