Tech : AIపై గూగుల్ 7 వేల 500 కోట్ల పెట్టుబడులు : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు

Tech : AIపై గూగుల్ 7 వేల 500 కోట్ల పెట్టుబడులు : ఇక ఉద్యోగాలే ఉద్యోగాలు

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ సంస్థ, ఐటీ దిగ్గజ కంపెనీ గూగుల్ ఏఐపై భారీగా పెట్టుబడులు పెట్టాలని డిసైడ్ అయింది. 2024తో పోల్చితే 2025లో మరింత ఇన్వెస్ట్ చేయాలని గూగుల్ నిర్ణయించుకుంది. ఈ సంవత్సరం మొత్తం రూ.7,500 కోట్ల పెట్టుబడులకు గూగుల్ సంస్థ సమాయత్తమవుతోంది. ఇందులో మెజార్టీ పెట్టుబడులు ఏఐపైనే ఇన్వెస్ట్ చేయాలని ఈ సెర్చ్ ఇంజిన్ సంస్థ నిర్ణయించింది. బార్డ్​పేరుతో ప్రస్తుతం జెమినీ పేరుతో గూగుల్ తమ ఏఐ చాట్​బాట్ను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. పార్టీ ప్లానింగ్​ కోసం టిప్స్​ ఇవ్వడం మొదలు, లంచ్​ ఐడియాలు, రిఫ్రిజిరేటర్లో ఏ ఫుడ్​ మిగిలిపోయిందనే వివరాల దాకా అన్నింటినీ ఈ గూగుల్ చాట్ బాట్ అందిస్తుంది. మనిషి లాగే మాటలు సాగించగలగడంతో పాటు, అడిగిన ప్రశ్నలకు బదులివ్వడమూ, వ్యాసాలు రాయడమూ, అంతెందుకు సాఫ్ట్​వేర్​ కోడ్​ కూడా రాసేయడం ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​టూల్స్తో సాధ్యపడుతుంది.

ఓపెన్​ ఏఐ ఇంక్ తెచ్చిన చాట్​జీపీటీ (ఏఐ టూల్​) మార్కెట్లో సంచలనాన్నే సృష్టిస్తోంది. సాంకేతిక రంగాల్లో  ఇప్పటికే ఎన్నో అద్భుతాలను సృష్టించిన మైక్రోసాఫ్ట్ , టెస్లా లాంటి సంస్థల అధినేతలు బిల్​గేట్స్, ఎలాన్ మస్క్ లాంటి  ప్రపంచ కుబేరులు ఏఐ రంగంలో  ఆసక్తిని చూపడం, పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టడమే కాకుండా ఏఐ ప్రభావం వాటి శక్తి  సామర్థ్యాలపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రపంచ కార్పొరేట్ మార్కెట్ శక్తులన్నీ ఏఐ రంగంలో  భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. కృత్రిమ మేధోశక్తి  ప్రభావం మానవ జీవితాలను ఎంతగానో ప్రభావితం చేయనుంది. 

ALSO READ | Good News: లోన్లు తీసుకున్న వారికి ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్బీఐ

జనరేటివ్ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌‌తో చాట్‌‌లు, ఇమేజ్‌‌లు వంటివి క్రియేట్ చేయడం) పై ఆసియా పసిఫిక్ దేశాలు ఎక్కువ ఫోకస్ పెడుతున్నాయి. ఇన్ఫోసిస్‌‌ రీసెర్చ్‌‌ రిపోర్ట్ ప్రకారం, 2024లో ఇండియా, సింగపూర్, చైనా, జపాన్‌‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌ దేశాలు ఏకంగా 3.4 బిలియన్ డాలర్లు (రూ.28,200 కోట్లు) ఖర్చు చేశాయి. నార్త్‌‌ అమెరికా దేశాలతో పోలిస్తే ఆసియా పసిఫిక్ దేశాలు జనరేటివ్‌‌ ఏఐ వాడకాన్ని  పెంచుతున్నాయి.  నార్త్ అమెరికన్ కంపెనీలతో పోలిస్తే తక్కువగా ఖర్చు చేస్తున్నా,  వీటిపై రీసెర్చ్ మాత్రం ఆసియా పసిఫిక్ దేశాల్లోని కంపెనీలే ఎక్కువగా చేస్తున్నాయని ఇన్ఫోసిస్‌‌ నాలెడ్జ్ ఇన్‌‌స్టిట్యూట్ (ఐకేఐ) వెల్లడించింది.