Google మాతృసంస్థ ఆల్ఫాబెట్ తన కస్టమర్లకు 700 మిలియన్ డాలర్ల పరిహారాన్ని చెల్లించనుంది. మొత్తం 50 US రాష్ట్రాలకు చెందిన కస్టమర్లు, అటార్నీ జనరల్ లు దాఖలు చేసిన యాంటీ ట్రస్ ఫిర్యాదును పరిష్కరించేందుకు ఈ మొత్తాన్ని చెల్లించేందుకు, ప్లే స్టోర్ లో మార్పులు చేసేందుకు ఒప్పుకుంది.
ఆండ్రాయిడ్ యాప్ స్టోర్ మార్కెట్ పై గూగుల్ అక్రమ గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని ఫిర్యాదులో ఆరోపించారు యూఎస్ కస్టమర్లు. ప్లే లావాదేవీలపై 30 శాతం కమిషన్ తీసుకుంటూ ఆండ్రాయిడ్ యాప్ ధలను పెంచి ఆండ్రాయిడ్ యాప్ ధరలను పెంచి పోటీ వ్యతిరేక విధానాలను గూగుల్ చేస్తోంది స్టేట్ అటార్నీ జనరల్ ఆరోపించారు. సెటిల్ మెంట్ లో గూగుల్ 700 మిలియన్ డాలర్లు కస్టమర్లకు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.
యాప్ ల కొనుగోళ్లకు ఎక్కువ చెల్లించిన వినియోగదారులకు 629 మిలియన్ డాలర్లు అందనున్నాయి. 70 మిలియన్ డాలర్ల రాష్ట్రాలకు చెల్లించబడతాయి. 1 మిలియన్ డాలర్లు సెటిల్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ కోసం కేటాయించారు. 7ఏళ్ల పాటు Google Play కాకుండా ఇతర మార్గాల ద్వారా మొబైళ్లలో థర్డ్ పార్టీ యాపల్ ఇన్ స్టాలేషన్ కు అనుమతించడానికి Google Android ని ప్రారంభించిందని ఫిర్యాదు దారు తన కంప్లైంట్ లో పేర్కొన్నారు.