దేవుడండీ మీరు దేవుడు : గూగుల్ పే ఇక నుంచి అప్పు కూడా ఇస్తుంది

దేవుడండీ మీరు దేవుడు : గూగుల్ పే  ఇక నుంచి అప్పు కూడా ఇస్తుంది

దేశంలో చిన్న వ్యాపారులకు గూగుల్ పే  (Google Pay) శుభవార్త అందించింది. గూగుల్ పే  (Google Pay) నుంచి లోన్ పొందే సౌకర్యాన్ని కల్పించింది. చిరు వ్యాపారులకు ఉపయోపడేలా గూగుల్ సాషే లోన్స్ ను ప్రారంభించింది. ఇందుకోసం డీఎంఐ ఫైనాన్స్ తో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది. 

ఎంత వరకు తీసుకోవచ్చు..ఎంత కట్టాలి..

చిన్న తరహా వ్యాపారుల కోసం గూగుల్ పే సాషే లోన్స్ అందిస్తోంది. ఈ విధానం ద్వారా చిన్న వ్యాపారులకు రూ. 15 వేల వరకు రుణం అందిస్తుంది. ఈ రుణాన్ని నెలవారీగా చెల్లించవచ్చు. 
గూగుల్ పే ద్వారా..ఈఎంఐలుగా రూ. 111 కంటే తక్కువ మొత్తంలో తిరిగి చెల్లించవచ్చు. వ్యాపారులు తమ వస్తువులను పొందడానికి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ డీలర్ల దగ్గర ఈ లోన్ తీసుకోవచ్చు. 

లోన్ పొందాలంటే నిబంధనలు ఇవే..

గూగుల్ పేలో చిరు వ్యాపారులు లోన్ పొందాలంటే వారి నెలవారీ ఆదాయం రూ. 30 వేల కంటే తక్కువ ఉండాలి. ఈ లోన్ ను రెండు రకాల వ్యాపారులకు అందించబడుతుంది. పట్టణాల్లో వ్యాపారం చేసేవారితో పాటు..గ్రామాల్లో వ్యాపారం చేసేవారికి కూడా ఈ లోన్ అందించబడుతుంది. 

చిరు వ్యాపారుల వర్కింగ్ కెపిటల్ అవసరాలకు ఈ పే లేటర్ సంస్థ భాగస్వామ్యంతో క్రెడిట్ లైన్ ను కూడా గూగుల్ పే ప్రారంభించింది. వ్యాపారులు తమ వ్యాపార వస్తువులను కొనుగోలు చేయడానికి అన్ని ఆన్ లైన్, ఆఫ్ లైన్ పంపిణీ దారుల దగ్గర ఈ లోన్లు పొందవచ్చు. ఐసీసీఐ భాగస్వామ్యంతో కూడా గూగుల్ సంస్థ తమ యూపీఐపై రుణాలను అందించే సేవలను ఇప్పటికే ప్రారంభించింది. అంతేకాకుండా యాక్సిస్ బ్యాంకుతో కలిసి గూగుల్ పే పర్సనల్ లోన్లు అందిస్తోంది.