ప్రముఖ సర్చ్ ఇంజిన్ సంస్థ గూగుల్ అందిస్తున్న One VPN సర్వీసును రద్దు చేసింది. ఈ యాప్ ను ఎక్కువ మంది వాడటం లేదన్న కారణంతో ఈ యాప్ ను రద్దు చేస్తున్నట్లు తెలిపింది గూగుల్. గూగుల్ వన్ ద్వారా క్లౌడ్ స్టోరేజ్ ను అందించేది. ఈ VPN యాప్ ద్వారా జీమెయిల్, గూగుల్ డ్రైవ్, గూగుల్ ఫోటోస్, వంటి యాప్స్ కి ఎక్స్ట్రా స్టోరేజ్ వాడుకునే వీలు ఉండేది. ఈ యాప్, యాండ్రాయిడ్, ఐవోఎస్, విండోస్, మ్యాక్ వంటి అన్ని ఓఎస్ లలో అందుబాటులో ఉండేది. తాజాగా గూగుల్ తీసుకున్న నిర్ణయంతో గూగుల్ వన్ వీపీఎన్ సర్వీసులు రద్దు కానున్నాయి.
గూగుల్ వన్ వీపీఎన్ రద్దు చేసినప్పటికీ సంస్థ అందిస్తున్న ఇతర వీపీఎన్ లు పిక్సెల్, ఎఫ్ ఐ సర్వీసులు అందుబాటులో ఉండనున్నాయి.ఈ సర్వీసుల్ని ఎక్కువ మంది వదట్లేదన్న కారణంతోనే రద్దు చేస్తున్నామని గూగుల్ స్పోక్స్ పర్సన్ తెలిపారు. ఇందులో ఉన్న బగ్స్ ని రిజాల్వ్ చేయటంకంటే, షట్ డౌన్ చేయటమే మంచిదని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిపింది గూగుల్.