సాధారణంగా మనం గూగుల్ ఖాతాలో పాస్‌వర్డ్ ద్వారా లాగిన్ అవుతాం. అయితే మీ ఫోన్‌లో టూ-స్టెప్ వెరిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటే పాస్‌వర్డ్ ఎంటర్ చేశాక అది సెకండ్ డివైజ్ అయితే ఫస్ట్ డివైజ్ నుంచి పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు మీ గూగుల్ ఖాతా మరింత సేఫ్‌గా ఉంటుంది. మీ జీ మెయిల్ ఐడీ, పాస్ వర్డ్ తెలిసినా మీ పర్మిషన్ లేందే దాంతో లాగిన్ అవ్వలేరు.
ఈ టూ స్టెప్ వెరిఫికేషన్ ఫీచర్ ఒకే మెయిల్ రెండుమూడు డివైజ్ ల్లో వాడేవాళ్లకు చాలా బాగా యూస్ అవుతుంది. మీ ఫోన్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ ఆన్ చేసి ఉంటే అదే మెయిల్ ఐడీతో వేరే లాప్ టాప్ లేదా, ఫోన్ లో లాగిన్ అవ్వడానికి మీ ఫస్ట్ డివైజ్ పర్మిషన్ అడుగుతుంది. అంటే మీ అనుమతి లేకుండా మీ జీ మెయిల్ ఇంకెవ్వరు లాగిన్ అవ్వలేరు. గూగుల్ కంపెనీ ఈ సెటప్ ను ఖాతాదారుల సేఫ్టీ కోసం తీసుకొచ్చింది.
ఎలా యాక్టివేట్ చేయాలి?
గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి, నావిగేషన్ ఆప్షన్లో సెక్యురీటి ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ పై క్లిక్ చేసి ఆన్ చేయాలి.
ఇది జీ మెయిల్ అకౌంట్ హోల్డర్స్ అందరికి తెలియాలని ఫోన్లలో దీన్ని సెట్ చేసుకోవడం చాలా ఈసీగా మర్చడానికి ట్రై చేస్తోంది. ఈ ఫీచర్ వచ్చిన ఫస్ట్ లో మెయిల్ సెట్టింగ్స్ లోకి వెళ్లి సపరేట్ గా యాక్టివేట్ చేసుకోవాల్సి ఉండే.. కానీ ఇప్పుడు గూగుల్ ఓన్ డివైజ్ ఆప్షన్ ఇచ్చి ఆటోమేటిక్ గా ఇతర లాప్ టాప్, ఫోన్ లో లాగిన్ అవ్వడానికి ఓ అలర్ట్ మెస్సెజ్ పంపుతుంది. ఫస్ట్ టైం జీ మెయిన్ లాగిన్ చేసిన డివైజ్ కు ఆ మెస్సెజ్ వెళ్తుంది. మీ మెయిల్ ఐడి మరో డివైజ్ లో ఎంటైర్ చేశారు.. అది మీరేనా? కాదా? రెండు ఆప్షన్లు పంపిస్తుంది.
Yes అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తేనే ఆ మెయిల్ ఐడీ ఇంకో డివైజ్ లో కూడా యాక్సిక్స్ అవుతుంది. ఇదే టూ స్టెప్ వెరిఫికేషన్.. ప్రారభంలో OTPతో దీన్ని కంఫామ్ చేయాల్సి ఉండే.. ఇప్పుడు ఆ ప్రాసెస్ గూగుల్ చాలా సింపుల్ చేసింది. ఫ్యూచర్ లో దీన్ని అన్ని అన్ని గూగుల్ జీ మెయిల్స్ కు వర్తించేలా, ఇంకా సింపుల్ గా యాక్టివేట్ చేసుకునేలా, ఫుల్ సేఫ్టేతో యూజర్లకు అందిస్తామని గూగుల్ చెబుతుంది. మరి మీ ఫోన్ లో టూ స్టెప్ వెరిఫికేషన్ చేసుకున్నారా? చేసుకోకుంటే ఇప్పుడే యాక్టివేట్ చేసుకోండి.