జూమ్ కు పోటీగా గూగుల్ కొత్త ఫీచర్

జూమ్ కు పోటీగా గూగుల్ కొత్త ఫీచర్

ఆక్లాండ్: ప్రముఖ వీడియో కాలింగ్ యాప్ జూమ్ కు పోటీగా గూగుల్ కొత్తగా ఓ ఫీచర్ ను డెవలప్ చేసింది. జీమెయిల్ కు ఈ వీడియో కాలింగ్ ఫీచర్ ను జత చేయనుంది. వచ్చే గురువారం నుంచి గూగుల్ బిజినెస్, ఎడ్యుకేషన్ యూజర్లు తమ జీ మెయిల్ నుంచి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. యూజర్ల భద్రత, ప్రస్తుతం వీడియో కాలింగ్ కు ఉన్న అధిక డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని గూగుల్ ఆల్ఫాబెట్ ఐఎన్ సీ యూనిట్ ఈ ఫీచర్ ను రూపొందించిదని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ జేవియర్ సోల్టెరో తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా డిమ్ లైటింగ్ లో కూడా హై వీడియో క్వాలిటీని అందిస్తున్నామని చెప్పారు. బ్యాగ్రౌండ్ నాయిస్ నూ ఫిల్టరింగ్ చేసేలా ఫీచర్ ను డెవలప్ చేశామన్నారు. కాగా, కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఉద్యోగులతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తున్నాయి. దీంట్లో భాగంగా ఎంప్లాయీస్ కు లక్ష్యాలను నిర్దేశించేందుకు వీడియో కాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నాయి. జూమ్ లాంటి అప్లికేషన్స్ ను విరివిగా వాడుతున్నాయి. అయితే జూమ్ యాప్ తో సమాచార చౌర్యం జరుగుతోందని.. ఆ యాప్ ను వాడొద్దని కేంద్రం తాజాగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.