సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్… కొత్తగా గూగుల్ (మెయిల్) ఉపయోగించేవారికి గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై వారి లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలీట్ కానున్నట్లు గూగుల్ సంస్థ తెలిపింది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్‌లో మార్పులు చేసినట్లు సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. ‘మేం ఏదైనా ప్రొడక్ట్‌ను రూపొందిచేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధతాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం. మరింత భద్రతను కల్పించే ఉద్దేశ్యంలో భాగంగా నేడు ప్రైవసీ అప్ డేట్ ను ప్రకటించామని తెలిపారు. డేటాకు సంబంధించి కొన్ని మార్పులు చేశామని’ తెలిపారు.
ఇప్పటివరకూ గూగుల్ హిస్టరీ డిలీట్ చేయాలంటే.. మాన్యువల్‌గా చేసేవాళ్లం. కానీ ఇక నుంచి అది ఆటోమెటిక్‌గా అవుతుంది. అయితే ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలు పెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని ఆయన తెలిపారు. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్‌గా డిలీట్ అవుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్‌ను గూగుల్ మార్చబోవడం లేదని కూడా తెలిపారు. ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్‌కు వర్తించదని వారు తెలిపారు.