ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లస్ సేవలు బంద్

ఏప్రిల్ నుంచి గూగుల్ ప్లస్ సేవలు బంద్

సాఫ్ట్‌ వేర్ దిగ్గ‌జ సంస్థ గూగుల్ త‌న Gప్ల‌స్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.  ఏప్రిల్ 2వ తేదీ నుంచి Gప్ల‌స్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్నామ‌ని ఆదివారం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది గూగుల్. Gప్లస్‌ లో ఉన్న ఓ ప్రైవ‌సీ బ‌గ్ వ‌ల్లే  Gప్ల‌స్ సేవ‌ల‌ను నిలిపివేస్తున్నామ‌ని గూగుల్ తెలిపింది. అయితే అందులో డేటాను డౌన్‌ లోడ్ చేసుకునే స‌దుపాయాన్ని మాత్రం గూగుల్ క‌ల్పించింది. G ప్ల‌స్‌ లో ఉన్న ఫొటోలు, వీడియోల‌ను యూజ‌ర్లు డౌన్‌ లోడ్ చేసుకోవ‌చ్చు.  ఫొటోస్ స్టోరేజ్‌ లో సేవ్ చేసుకోవ‌చ్చు అని తెలిపింది.