ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగంలో ఓ సంచలనం. ఇటీవల దీని క్రేజ్ మరింత పెరిగింది. AI రంగంలో భారీపెట్టుబడులు పెట్టేందుకు టెక్ కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి.రానున్న కాలంలో ఈ పెట్టుబడులు మరింత పెరుగుతాయని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐలతో పాటు గూగుల్ లేటెస్ట్ టెక్నాలజీ అభివృద్ధి కోసం పోటీ పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అభివృద్ధి చేసేందుకు ఈ కంపెనీ 100 బిలియన్లు పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించింది.
గూగుల్ సంస్థ.. AI అభివృద్ధిలో 100 బిలియన్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టడానికి సిద్దమైంది. పోటీదారులతో ఆధిపత్యం కొనసాగించే లక్ష్యంతో పెట్టుబడులు పెడుతోంది. మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ కలిసి 100 బిలియన్ డాలర్ల తో స్టార్ గేట్ సూపర్ కంప్యూటర్ ప్రాజెక్ట్ పై పెట్టుబడులు పెడుతున్నాయి.
AI అభివృద్ధికి పెరుగుతున్న ఖర్చులు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో భారీ పెట్టుబడులే ఈ పరిశ్రమలో AI వ్యవస్థ పెరుగుతున్న అభివృద్ధిని సూచిస్తున్నాయి. 2023లోనే AI లో పెట్టుబడులు 50 బిలియన్ డాలర్లు పెరిగాయని.. ఇది ఏఐ ఆవిష్కరణలు పెరుగుదల అవసరాన్ని సూచిస్తున్నాయని స్టార్టప్ లు చెబుతున్నాయి.
అయితే ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (AGI) శిక్షణ, మ్యాన్ పవర్ తో ధీటుగా పనిచేయగల AI సామర్థ్యం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. గూగుల్ కు చెందిన LLM, Open AI కి చెందిన GPT సిరీస్ వంటి లేటెస్ట్ AI మోడల్ లను అభివృద్ధి చేస్తున్నాయి. వీటికి అధిక పెట్టుబడులు అవసరం. రోజురోజుకు వీటి ఖర్చు పెరిగుతుంది.
పెరుగుతున్న శిక్షణ ఖర్చులు
AI మోడళ్ల శిక్షణకు ఖర్చులు కూడా భారీగా ఉన్నాయి. స్టోన్ ఫోర్డ్ యూనివర్సిటీ AI సూచిక నివేదిక ప్రకారం.. Open AI కి చెందిన GPT-4 శిక్షణ కోసం 78 మిలియన్ డాలర్ల విలువైన కంప్యూటింగ్ శక్తి అవసరం. 2020లో GPT-3 కోసం ఖర్చు కేవలం 4.3 మిలియన్ డాలర్లు మాత్రమే. అదేవిధంగా Google జెమిని అల్ట్రా శిక్షణ కోసం 191 మిలియన్ల డాలర్లను వెచ్చించింది. ఇది AI అభివృద్ధి పెరుగుతున్న సంక్లిష్టత, అవసరాన్ని నొక్కి చెపుతున్నాయి.
AI టెక్నాలజీ వినియోగంలో పోటీ పెరుగుతున్నందున టెక్ దిగ్గజం Google , Open AI ఈ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలు చేస్తున్నాయి.