యాపిల్ పరికరాల్లో డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉండాలని టెక్ దిగ్గజం గూగుల్ .. యాపిల్ కు బిలియన్లు చెల్లించినట్లు తెలుస్తోంది. సఫారీ నుంచి క్రోమ్ సెర్చ్ ఇంజిన్ కు మారడానికి గూగుల్.. యాపిల్ ఐఫోన్ వినియోగదారులను ఒప్పించేందుకు కూడా ప్రయత్నిస్తోందని..సెర్చ్ మార్కెట్లో గుత్తాధిపత్యం చెలాయిస్తోందని గూగుల్ పై అమెరికాలో యాంటీ ట్రస్ట్ కేసు నడుస్తోంది.
వివిధ బ్రౌజర్లు, ఫోన్లలో డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉండేందుకు కొంత చెల్లింపులు చేయడం ద్వారా ఆన్ లైన్ సెర్చింగ్ లో గుత్తాధిపత్యాన్ని స్థాపించిందని ఆరోపణలతో గూగుల్ పై విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో యాపిల్ పరికరాల్లో గూగుల్ డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా ఉండాలని యాపిల్ కు బిలియన్ డాలర్లను ముట్టు చెప్పినట్లు తెలుస్తోంది.
Apple సఫారీ బ్రౌజర్ లో గూగుల్ ను డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ గా మార్చాలనే ఒప్పందంలో భాగంగా గూగుల్ యాపిల్ కి 10 నుంచి 20 బిలియన్ల డాలర్ల వరకు భారీ మొత్తాన్ని చెల్లించినట్లు తెలుస్తోంది. ది న్యూయార్క్ టైమ్స్ ప్రకారం.. ఒక్క 2021లో గూగుల్, యాపిల్ కి 18 బిలియన్ డాలర్లు చెల్లించింది. అయితే తన సెర్చింగ్ టెక్నాలజీ అభివృద్ది కోసం యాపిల్ చేస్తున్న ప్రయత్నాలపై గూగుల్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. యాపిల్ ఐఫోన్ లో సెర్చ్ ఇంజిన్ గా ఇప్పటికే స్పాట లైట్ ఉంది. ఇది గూగుల్ లాగే రిచ్ వెబ్ ఫలితాలను అందిస్తోంది. ఐఫోన్లలో సొంత వెర్షన్ అభివృద్ది చేయడం ద్వారా స్పాట్ లైట్ తో పోటీ పడే మార్గాలను అన్వేషిస్తోంది. దీంతోపాటు యాపిల్ యొక్క సఫారీ బ్రౌజర్ నుంచి గూగుల్ క్రోమ్ వెబ్ బ్రౌజర్ కి మారడానికి ఎక్కువ మంది ఐఫోన్ వినియోగదారులను ప్రోత్సహించడం లక్ష్యంగా గూగుల్ పనిచేస్తోంది.
అమెరికా వెర్సెస్ గూగుల్ యాంటీ ట్రస్ట్ ట్రయల్ సందర్భంగా మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మాట్లాడుతూ.. యాపిల్ సెర్చింగ్ టెక్నాలజీని మెరుగు పర్చే విషయం గురించి గూగుల్ ఆందోళన చెందుతుంటే.. మరోవైపు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ను ఉపయోగించేలా ఎక్కువ మంది వినియోగదారులను ఒప్పించేందుకు Gamil వంటి సేవలను వినియోగించుకుంటుంది.. ఇదే విషయమై యాపిల్ ఆందోళన చెందుతుందని అన్నారు.
డిఫాల్ట్ బ్రౌజింగ్ గురించి మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మనసులో మాట బయటపెట్టాడు. యాపిల్ డివైజ్ లలో మైక్రోసాఫ్ట్ డీఫాల్ట్ బ్రౌజర్ గా మారాలనే ఆకాంక్ష ఉందని.. ఆర్థిక పరిమితుల వల్ల ఆగామని.. యాపిల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ స్థానం సంపాదించేందుకు మైక్రోసాఫ్ట్ 15 బిలియన్ డాలర్లు వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉందని సత్య నాదెళ్ల చెప్పాడు. అయితే సత్య నాదెళ్ల ఆఫర్ ను యాపిల్ తిరస్కరించింది.