ఫేవరెట్ స్పోర్ట్స్ టీమ్‌కు సంబంధించి మ్యాచ్ జరుగుతున్నప్పుడు బిజీగా ఉంటే లైవ్ చూసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు గూగుల్ ద్వారా ఆండ్రాయిడ్ ఫోన్లలో హోమ్‌స్క్రీన్‌పై స్కోర్స్ చూసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు మరిన్ని హంగులద్దుతోంది గూగుల్. సెర్చ్ బార్లో క్లిక్ చేసి, ఒక మ్యాచ్‌ను పిన్ చేసుకుంటే హోమ్‌స్క్రీన్‌పై లైవ్ స్కోర్ కనిపిస్తుంది.
అయితే త్వరలో రానున్న ఫీచర్ ద్వారా ఇలా ఒక మ్యాచ్‌ను పిన్ చేశాక, ఫ్లోటింగ్ బాక్స్‌పై క్లిక్ చేయాలి. దీనిపై ట్యాప్ చేశాక ‘ఆటోమేటికల్లీ పిన్ ఫ్యూచర్ మ్యాచెస్’ ఆప్షన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్‌చేసి, కావాల్సిన మ్యాచ్‌లు, నచ్చిన టీమ్‌లను సెలెక్ట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన మ్యాచ్‌లు ఎప్పుడు జరిగినా వెంటనే లైవ్స్కోర్తో అప్ డేట్స్ ఆటోమేటిగ్గా వస్తుంటాయి.