క్యాలెండర్‌లో వర్కింగ్ లొకేషన్‌లను సెట్ చేసేందుకు కొత్తగా ఓ ఫీచర్‌ను విడుదల చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. 2021 నుంచి యూజర్స్ నేరుగా గూగుల్ (Google) క్యాలెండర్ అనే ఫీచర్ అందుబాటులో ఉండగా.. టెక్ దిగ్గజం ఈ తాజా విషయాన్ని వర్క్ స్పేస్ అప్ డేట్స్ (Workspace Updates) బ్లాగ్‌పోస్ట్‌లో చెప్పుకొచ్చింది. ఇప్పుడు, క్యాలెండర్‌లో పని చేసే స్థానాలను సెట్ చేసే ఎంపికను పరిచయం చేసింది.
ఈ ఫీచర్ యూజర్స్ సెట్ చేసిన ఆప్షన్ల ఆధారంగా పనిచేయనుంది. కంపెనీ 2021లో గూగుల్ క్యాలెండర్ లో ఫోకస్ టైమ్ ను తీసుకువచ్చింది. ఇప్పుడు ఈ ఫోకస్ మోడ్ ను మరింత మెరుగుద్దుతూ అందుబాటులోకి తేనుంది. ఇది యూజర్స్ కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూడా సహాయపడనుంది.
ALSO READ :క్రమబద్ధీకరణ రుసుం తగ్గించాలని బీజేపీ శ్రేణుల నిరసన
గూగుల్ మొదట్లో తీసుకువచ్చిన క్యాలెండర్ లో ఫోకస్ టైమ్ ఫీచర్ వల్ల యూజర్స్.. నిర్ణీత వ్యవధిలో ఎంపిక చేసిన సమావేశాలు, ఇతర నోటిఫికేషన్లను సమయానుగుణంగా రిజెక్ట్ లేదా యాక్సెప్ట్ చేయవచ్చు. ఇప్పుడు గూగుల్ చాట్ నోటిఫికేషన్ లోనూ మార్పులు తీసుకురానుంది. ఇందులో డోన్ట్ డిస్టర్బ్, ఆటోమేటికల్లీ డిక్లైన్ మీటింగ్ అనే ఆప్షన్.. అంటే వాటంతటవే రిజెక్ట్ అయ్యే ఆప్షన్ ను తీసుకురానుంది. ఇది ఫోకస్ టైమ్ లో చాట్ నోటిఫికేషన్ లను మ్యూట్ చేయడంతో పాటు గూగుల్ చాట్ నోటిఫికేషన్ లను కూడా బ్లాక్ చేస్తుంది.
ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న విషయానికొస్తే, ఎంటర్‌ప్రైజ్ స్టాండర్డ్, ఎంటర్‌ప్రైజ్ ప్లస్, బిజినెస్ స్టాండర్డ్, బిజినెస్ ప్లస్, ఎడ్యుకేషన్ స్టాండర్డ్, ఎడ్యుకేషన్ ప్లస్, లాభాపేక్ష లేని యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురావడం ప్రారంభించినట్లు గూగుల్ తెలిపింది.
ఈ ఫీచర్ గురించి సరిగ్గా తెలియకపోతే, మీరు Google క్యాలెండర్‌లో ఫోకస్ టైమ్‌ని ఎలా సెట్ చేయవచ్చు అనేదానికి ఈ కింది స్టెప్స్ దావారా తెలుసుకోండి.
PCలో Google క్యాలెండర్‌లో ఫోకస్ సమయాన్ని ఎలా సెట్ చేయాలి
Step 1: PCలో Google క్యాలెండర్‌ని ఓపెన్ చేయండి.
Step2: ఫోకస్ సమయాన్ని షెడ్యూల్ చేయాలనుకుంటున్న సమయాన్ని క్లిక్ చేయండి.
Step 3: ఈవెంట్ ఎగువన, ఫోకస్ టైమ్‌ని క్లిక్ చేయండి.
Step 4: మీ ఈవెంట్ ఎప్పుడు ప్రారంభించాలో లేదా ముగించాలనుకుంటున్నారో ఎంచుకోండి.
Step 5: ఫోకస్ టైమ్ ప్రాధాన్యతలను సెట్ చేసి, సేవ్ చేయి అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.