‘గూగుల్ ఇమేజెస్’ ను తలదన్నేలా ‘ఇమేజెన్’

ప్రపంచాన్ని నడిపిస్తున్న టెక్ ఇంజిన్..గూగుల్ !!  ఇంటర్నెట్ ప్రపంచానికి దిక్సూచిగా నిలుస్తున్న గూగుల్ మరో సరికొత్త ఫీచర్ ను తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైంది.  మనం గూగుల్ లో ఇమేజెస్  ఆప్షన్ ను క్లిక్ చేసి.. ఏదైనా పదాన్ని కొడితే అందుకు సంబంధించిన ఫొటోలన్నీ ప్రత్యక్షం అయ్యే ఫీచర్ ఇప్పటికే ఉంది. ఇంతకు మించిన మరో ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాల్లో ‘గూగుల్ సెర్చ్ బ్రెయిన్ టీమ్’ నిమగ్నమై ఉంది. ఆ ఫీచర్ పేరే ‘ఇమేజెన్’.ఇది అధునాతన కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్)తో పనిచేస్తుంది. భవిష్యత్తులో గూగుల్ లో ‘ఇమేజెన్’ అనే ప్రత్యేక ఆప్షన్ యాడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 

‘ఇమేజెన్’ అనేది..

‘ఇమేజెస్’ అనేది మనం గూగుల్ సెర్చ్ బాక్స్ లో ఒక పదం కొడితే ఫొటోలను చూపించే ఆప్షన్ కాగా.. ‘ఇమేజెన్’ అనేది సెర్చ్ బాక్స్ లో కొన్ని వాక్యాలు (700 నుంచి 2000 పదాలు) టైప్ చేసినా ఫొటోలను చూపించగలదు. మనం సెర్చ్ బాక్స్ లో  రాసే టెక్స్ట్ లోని నామవాచకాలు, క్రియా పదాలను అర్థం చేసుకొని అందుకు అద్దంపట్టే ఫొటోలను చూపించే అల్గారిథమ్ తో ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫీచర్ రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉన్న ఈ ఫీచర్ ను మీరు కూడా చూడొచ్చు. గూగుల్ లోకి వెళ్లి  imagen.research.google అని టైప్ చేస్తే దీనికి సంబంధించిన ప్రయోగాత్మక వెబ్ సైట్ తెరుచుకుంటుంది. ఏవిధమైన వాక్యాలు టైప్ చేస్తే.. ఏ విధమైన ఫొటోలను ‘ఇమేజెన్’ చూపించిందనే విషయాన్ని ఆ వెబ్ సైట్ లో గూగుల్ వివరించింది. ఇమేజెన్ ఫీచర్ ఎలా పనిచేస్తుందనే విషయాన్ని కూడా పేర్కొంది.అయితే ఈ ఫీచర్ ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. ఇప్పటిదాకా 200 వాక్యాలను ఇమేజెన్ లో సెర్చ్ చేయగా వచ్చిన ఏఐ ఇమేజ్ లను పరీక్షించారు. అవి టెక్స్ట్ కు పొందికగా ఉన్నాయా ? లేదా ? అనేది తులనాత్మకంగా విశ్లేషించారు. ఈ ఫీచర్ ను ఇప్పటికిప్పుడు గూగుల్ లో  అందుబాటులోకి తెచ్చే అవకాశాలు లేవు. ఎందుకంటే.. దీన్ని కొంతమంది నెటిజెన్లు దుర్వినియోగం చేసే ముప్పు ఉంది. ఇమేజెన్ ను నెటిజన్లు దుర్వినియోగం చేయకుండా నిరోధించే సాంకేతికతను జోడించిన తర్వాతే.. దాని విడుదలపై గూగుల్ దృష్టిసారించనుంది.  

మరిన్ని వార్తలు.. 

రూ.12లక్షలు పెట్టి మరీ కుక్కలా మారాడు

3 లోక్సభ, 7 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు