రైతుల ముసుగులో దాడి

రైతుల ముసుగులో దాడి
  • లగచర్ల ఘటనపై దర్యాప్తు జరపాలని డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి
  • రాజకీయ కుట్రలో భాగమే ఈ ఘటన: వంగ రవీందర్ రెడ్డి 
  • కలెక్టర్‌‌పై దాడి ఖండించిన ట్రెసా, ఉద్యోగ సంఘాలు
  • లగచర్ల ఘటనపైసమగ్ర దర్యాప్తు జరపాలి 
  • డీజీపీకి ఉద్యోగుల జేఏసీ వినతి

హైదరాబాద్, వెలుగు: ప్రజాభిప్రాయ సేక‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌ణ‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన వికారాబాద్ క‌‌‌‌‌‌‌‌లెక్టర్‌‌‌‌‌‌‌‌, ఇత‌‌‌‌‌‌‌‌ర అధికారుల‌‌‌‌‌‌‌‌పై రైతుల ముసుగులో కొంద‌‌‌‌‌‌‌‌రు ప‌‌‌‌‌‌‌‌థ‌‌‌‌‌‌‌‌కం ప్రకార‌‌‌‌‌‌‌‌మే దాడి చేసిన‌‌‌‌‌‌‌‌ట్టుగా కనిపిస్తున్నదని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.ల‌‌‌‌‌‌‌‌చ్చిరెడ్డి అన్నారు. దాడి చేసినోళ్లను, దాడి వెనుక ఉన్నోళ్లను గుర్తించి చ‌‌‌‌‌‌‌‌ట్ట ప్రకారం చ‌‌‌‌‌‌‌‌ర్యలు తీసుకోవాల‌‌‌‌‌‌‌‌ని కోరారు. ఈ మేరకు మంగళవారం డీజీపీ జితేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. లగచర్ల ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 

ప్రజ‌‌‌‌‌‌‌‌ల సంక్షేమం, అభివృద్ధి కోసం ప‌‌‌‌‌‌‌‌ని చేసే ఉద్యోగుల‌‌‌‌‌‌‌‌పై దాడులు చేయడం స‌‌‌‌‌‌‌‌రైన ప‌‌‌‌‌‌‌‌ద్ధతి కాద‌‌‌‌‌‌‌‌న్నారు. తమ వినతిపై డీజీపీ సానుకూలంగా స్పందించార‌‌‌‌‌‌‌‌ని, దోషులను వ‌‌‌‌‌‌‌‌దిలే ప్రస‌‌‌‌‌‌‌‌క్తి లేద‌‌‌‌‌‌‌‌ని చెప్పార‌‌‌‌‌‌‌‌ని జేఏసీ నాయ‌‌‌‌‌‌‌‌కులు తెలిపారు. అనంత‌‌‌‌‌‌‌‌రం సెక్రటేరియెట్ లోని మీడియా సెంట‌‌‌‌‌‌‌‌ర్‌‌‌‌‌‌‌‌లో వాళ్లు మీడియాతో మాట్లాడారు. అధికారుల‌‌‌‌‌‌‌‌పై దాడులు చేసేలా జనాన్ని ఉసికొల్పడం స‌‌‌‌‌‌‌‌రైన ప‌‌‌‌‌‌‌‌ద్ధతి కాద‌‌‌‌‌‌‌‌ని వి.లచ్చిరెడ్డి అన్నారు. అధికారుల‌‌‌‌‌‌‌‌పై దాడి జరిగినప్పుడు నోరుమెద‌‌‌‌‌‌‌‌ప‌‌‌‌‌‌‌‌నోళ్లు.. నిందితులను అరెస్టు చేస్తే ఖండించ‌‌‌‌‌‌‌‌డం ఎంత వ‌‌‌‌‌‌‌‌ర‌‌‌‌‌‌‌‌కు స‌‌‌‌‌‌‌‌రైన‌‌‌‌‌‌‌‌ద‌‌‌‌‌‌‌‌ని ప్రశ్నించారు. 

‘‘క‌‌‌‌‌‌‌‌లెక్టర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి వ‌‌‌‌‌‌‌‌చ్చిన‌‌‌‌‌‌‌‌ప్పుడు రైతులు, గ్రామ‌‌‌‌‌‌‌‌స్తులు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పుకునే అవ‌‌‌‌‌‌‌‌కాశం ఉంది. కానీ దురుసుగా ప్రవ‌‌‌‌‌‌‌‌ర్తించి దాడుల‌‌‌‌‌‌‌‌కు దిగ‌‌‌‌‌‌‌‌డం, వాహ‌‌‌‌‌‌‌‌నాల‌‌‌‌‌‌‌‌ను ధ్వంసం చేయ‌‌‌‌‌‌‌‌డం స‌‌‌‌‌‌‌‌రైన ప‌‌‌‌‌‌‌‌ద్ధతి కాదు. అధికారుల‌‌‌‌‌‌‌‌పై దాడులు చేసే సంస్కృతిని ఎవ‌‌‌‌‌‌‌‌రూ స‌‌‌‌‌‌‌‌హించ‌‌‌‌‌‌‌‌రు” అని అన్నారు. జేఏసీ నాయ‌‌‌‌‌‌‌‌కులు కె.రామ‌‌‌‌‌‌‌‌కృష్ణ, ఎస్‌‌‌‌‌‌‌‌.రాములు, ర‌‌‌‌‌‌‌‌మేశ్, పూల్‌‌‌‌‌‌‌‌సింగ్ చౌహాన్‌‌‌‌‌‌‌‌, రాధ‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఉద్యోగుల జేఏసీ వైస్​ చైర్మన్​ ఏలూరి శ్రీనివాస రావు, ట్రెసా స్టేట్​ ప్రెసిడెంట్​వంగ రవీందర్​ రెడ్డి, డిప్యూటీ కలెక్టర్స్​ అసోసియేషన్​ ప్రెసిడెంట్​ చంద్ర మోహన్​ కూడా డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు.