
మెదక్ టౌన్, వెలుగు: సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవుగా ప్రకటించడం హర్షణీయమని మెదక్ జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి జిల్లాకు రూ. కోటి నిధులు మంజూరు చేసి సేవాలాల్జయంతి వారోత్సవాలు నిర్వహించాలన్నారు. అలాగే గిరిజన గ్రామ పంచాయతీలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా మార్చాలన్నారు.
పోడు భూములకు పట్టాలు అందించి గిరిజనుల సమస్యలను తీర్చాలన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ సంఘం మెదక్ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రీను నాయక్, ఎస్టీ సెల్ మెదక్ జిల్లా అధ్యక్షుడు అశోక్ నాయక్, మెదక్ నియోజకవర్గ గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షుడు స్వామి నాయక్, రాజాసింగ్, రమేశ్ నాయక్, దేవీదాస్ నాయక్, సురేశ్ నాయక్, నరేశ్ నాయక్, ప్రేమ్ నాయక్, బాబా నాయక్, గణేశ్‌నాయక్ పాల్గొన్నారు.