నక్కలగుట్ట, వెలుగు: ట్రాన్స్ఫార్మర్ల ఫెయిల్యూర్స్ తగ్గించడంతో పాటు రిపేర్లు ఆలస్యం కాకుండా చూడాలని టీఎస్ ఎన్పీడీసీఎల్ సీఎండీ అన్నమనేని గోపాలరావు ఆఫీసర్లను ఆదేశించారు. హనుమకొండ నక్కలగుట్టలోని టీఎస్ ఎన్పీడీసీఎల్ విద్యుత్ భవన్లో సోమవారం వరంగల్, మహబూబాబాద్ జిల్లాల ఎస్ఈలు, డీఈలు, ఇతర ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ.. ఎన్పీడీసీఎల్ దత్తత గ్రామాల్లో పారామీటర్ల పరంగా అన్ని పనులు పూర్తి చేయాలన్నారు.
ALSOREAD:కౌశిక్ రెడ్డిపై 24 గంటల్లో చర్యలు తీసుకోవాలి .. రాష్ట్ర ముదిరాజ్ సంఘం ఫైర్
కాలిపోయిన, పనిచేయని మీటర్లను మార్చాలని, సంవత్సరం పైబడిన డిస్ కనెక్షన్ లిస్ట్ సర్వీసులను తనిఖీ చేయాలన్నారు. సబ్ స్టేషన్ల నిర్వహణ ఎప్పటికప్పుడు చూసుకోవాలని, లైన్ల పాట్రోలింగ్ తప్పనిసరిగా నిర్వహించాలని సూచించారు. సిబ్బంది హెడ్ క్వార్టర్స్ లోనే ఉండాలని, ట్రాన్స్ ఫార్మర్ల రిపేర్లు పెంచాలన్నా రు. కార్యక్రమంలో డైరెక్టర్లు బి.వెంకటేశ్వర రావు, పి.గణపతి, పి.సంధ్యారాణి, పి.మోహన్ రెడ్డి, వి.తిరుపతి రెడ్డి, సీజీఎంలు, ఎస్ఈలు పాల్గొన్నారు.