అద్భుతం తల్లీ అద్భుతం : వీడియో కాల్ ఫోన్ కు కుంభమేళాలో పవిత్ర స్నానం

అద్భుతం తల్లీ అద్భుతం : వీడియో కాల్ ఫోన్ కు కుంభమేళాలో పవిత్ర స్నానం

ఈ ఐడియా అద్భుతం.. మహా అద్బుతం.. ఐడియాలకు ఇండియాలో కొదవ లేని నిరూపిస్తున్నారు జనం. కుంభమేళాలో పవిత్ర స్నానం చేయటం కామన్.. అక్కడికి వెళ్లలేని వాళ్లు తమ ఫొటోలను పంపి.. ఆ ఫొటోలను త్రివేణి సంగమంలో ముంచి పునీతులను చేస్తున్నారు మరికొందరు. ఇది నిన్నా మొన్నటి వరకు జరిగింది.. ఇప్పుడు ట్రెండ్ మారింది. కుంభమేళా ముగింపు దశలో.. వీడియో కాల్ సమయంలో.. సెల్ ఫోన్ ను నదిలో ముంచి.. పవిత్ర స్నానం చేయించిన మహిళ ఘటన ఇప్పుడు ఔరా అనిపిస్తోంది. దేశం అవాక్కయ్యేలా ఈ ఐడియా ఎలా వచ్చిందీ అంటూ నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.

ఓ మహిళ కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తుండగా.. తన భర్తకు వీడియో కాల్ చేసి, ఆ ఫోన్ కు కూడా నదిలో స్నానం చేయించింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ నెటిజన్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా.. అది కాస్తా వైరల్ గా మారింది. గోపి బహు ఇన్ ప్రయాగ్ రాజ్ అన్న క్యాప్షన్ తో షేర్ చేసిన ఈ వీడియోకి మీమ్ కంటెంట్ తో కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Swati Chauhan (@swatic12)

నెట్టింట తెగ వైరల్ అవుతున్న ఈ వీడియోకి పోస్ట్ చేసిన 7గంటల్లోనే మంగళవారం ( ఫిబ్రవరి 25 ) సాయంత్రానికి 72వేల వ్యూస్ తో చక్కర్లు కొడుతోంది.