Vishwam Twitter X Review: 'విశ్వం' ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్, శ్రీనువైట్లకు ఈసారి హిట్ రాసిపెట్టి ఉందట!

Vishwam Twitter X Review:  'విశ్వం' ట్విట్టర్ రివ్యూ.. గోపీచంద్, శ్రీనువైట్లకు ఈసారి హిట్ రాసిపెట్టి ఉందట!

మాస్ హీరో గోపీచంద్(Gopichand), దర్శకుడు శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు సంయుక్తంగా నిర్మించిన సినిమా 'విశ్వం'. భారీ అంచనాల మధ్య ఈ మూవీ దసరా కానుకగా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 11న) థియేటర్లలలో ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

టీజర్, ట్రైలర్ తో స్టైలీష్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌ట‌న‌ర్‌గా తెర‌కెక్కిన విశ్వం ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉంది? ఈ సినిమాతో హీరోగా గోపీచంద్ ఎలాంటి హిట్ కొట్టబోతున్నాడు? శ్రీను వైట్ల తన మ్యాజిక్ ని చూపించాడా? లేదా అనేది ట్విట్టర్ X రివ్యూలో తెలుసుకుందాం.

టాలీవుడ్ లో కామెడీకి కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచాడు డైరెక్ట‌ర్‌ శ్రీనువైట్ల. త‌న‌దైన మార్కు ఫార్ములా క‌థ‌ల‌తో పెద్ద విజ‌యాల్ని అందుకున్నాడు. మ‌రోసారి త‌న‌కు అచ్చొచ్చిన కామెడీని న‌మ్ముకొని శ్రీనువైట్ల విశ్వం మూవీని తెర‌కెక్కించిన‌ట్లు నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తున్నారు. ప‌క్కా శ్రీనువైట్ల మార్కు కామెడీ మూవీ ఇద‌ని ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

గోపీచంద్ మార్క్ యాక్షన్‌‌‌‌‌‌‌‌తోపాటు శ్రీను వైట్ల మార్క్ హిలేరియస్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్ ఇందులో ఉన్నాయని.. ఓ బర్నింగ్ ఇష్యూని తీసుకుని దాన్ని వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశారని.. గోపీచంద్ పాత్రలో చాలా షేడ్స్ ఉన్నాయని.. కథ ప్రకారం సాగే యాక్షన్ సీన్స్ హైలైట్‌‌‌‌‌‌‌‌గా నిలుస్తాయని అంటున్నారు.

‘వెంకీ’ మూవీ తరహాలో ఇందులోనూ ఓ ట్రైన్‌‌‌‌‌‌‌‌ ఎపిసోడ్‌‌‌‌‌‌‌‌ ఉందని.. దానికి దీనికి చాలా తేడా ఉంటుందని.. ముప్ఫై నిమిషాల పాటు వెన్నెల కిశోర్, వీటీ గణేష్, నరేష్, కవిత, చమక్ చంద్ర, షకలక శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లతో ట్రైన్ జర్నీ చాలా బాగుందని..ఒక ఫన్ రైడ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌తో పాటు ఎమోషన్‌‌‌‌‌‌‌‌ కూడా ఉండేలా సినిమా సాగిందని నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. 

యాక్షన్ సన్నివేశాలను భారీగా తీయడంలో డైరెక్టర్ బోయపాటి శ్రీనుకు ఒక స్టైల్ ఉంది. 'విశ్వం' సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ చూశాక... బోయపాటిని శ్రీను వైట్ల గుర్తు చేశారని ఒక నెటిజన్ ట్వీట్ చేశాడు. కొన్ని సన్నివేశాలలో బోయపాటి గుర్తొచ్చాడు అని ట్వీట్ చేశాడు. 

విశ్వం డీసెంట్ ఎంటర్‌టైనర్.. పాత సినిమాల సాధారణ ఫార్ములాతో ఫస్టాఫ్ సాగింది. మొదటి సగం తర్వాత కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా వచ్చాయి. తర్వాత సినిమా సీరియస్ మూడ్ మరియు లెంగ్తీ క్లైమాక్స్ మరియు అక్కడక్కడా రొటీన్ సన్నివేశాలు ఉన్నాయని..కామెడీ, యాక్ష‌న్ క‌ల‌బోసిన పాత్ర‌లో గోపీచంద్ న‌ట‌న బాగుంద‌ని, స్టైలిష్ క‌నిపించాడ‌ని ఓ నెటిజ‌న్ అన్నాడు. 
ఆగడు తర్వాత శ్రీనువైట్ల నుండి చాలా మంచి సినిమా వచ్చిందని చెబుతున్నారు. 

అలాగే ఇదేమీ శ్రీను వైట్ల కమ్ బ్యాక్ అని చెప్పలేం కానీ.. ఆగడు తరువాత అంతో ఇంతో చూడదగ్గ మూవీ మాత్రం అవుతుంది అంటూ శ్రీను వైట్ల గురించి చెబుతున్నారు. సినిమా చూడటం పూర్తయింది.. ఓవరాల్ ఎబో యావరేజ్ మూవీ.. ఒక్కసారి చూడొచ్చు.. కాకపోతే క్లైమాక్స్ ల్యాగ్, సాగదీసినట్టుగా అనిపిస్తుందని మరో నెటిజన్ కామెంట్ చేసాడు. 

విశ్వం సినిమా చూసాను. సినిమా అంతా నవ్వు ఆపుకోలేకపోయాను. నేను ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తిగా ఆనందించాను!  యాక్షన్ ఎంటర్‌టైనింగ్ తో పాటు ఎమోషన్స్ ఉన్న అద్భుతమైన చిత్రం! అని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు.