Srinu Vaitla-Gopichand: స్టైలిష్గా జర్నీ ఆఫ్ విశ్వం మేకింగ్ వీడియో..'వెంకీ' సినిమా ట్రైన్ కామెడీ రిపీట్.!

Srinu Vaitla-Gopichand: స్టైలిష్గా జర్నీ ఆఫ్ విశ్వం మేకింగ్ వీడియో..'వెంకీ' సినిమా ట్రైన్ కామెడీ రిపీట్.!

మాస్ హీరో గోపీచంద్(Gopichand), దర్శకుడు శ్రీనువైట్ల(Srinu Vaitla) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.  పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి తాజాగా జర్నీ ఆఫ్ విశ్వం (The Journey of Viswam) పేరుతో మేకింగ్ వీడియోని రిలీజ్ చేశారు మేకర్స్. 

ఈ మేకింగ్ వీడియోలో షూటింగ్‌కు సంబంధించిన సీన్స్‌తో పాటు ఇటలీలో షూట్ చేసిన హై యాక్షన్ సీక్వెన్స్ లను ఎక్కువగా చూపించారు. వీడియో చాలా స్టైలీష్ అండ్ రిచ్ గా ఉంది. వెంకీ సినిమాలోని ట్రైన్ ఎపిసోడ్ మాదిరిగా ఇందులో కూడా ఓ ఎపిసోడ్ బ్లాస్ట్ అయ్యేలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది. దాంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది.ఈ వీడియోలో తెలుగు ఫేమస్ కమెడియన్స్  ను డైరెక్టర్ చూపించడంతో డబుల్ ఫన్ జెనెరేట్ అయ్యేలా తెలుస్తోంది. 

కాగా శ్రీను వైట్ల  ఆగడు,మిస్టర్‌,అమర్‌ అక్బర్‌ ఆంటోని వంటి మూవీస్ తో భారీ డిజాస్టర్స్ తెచ్చుకున్నారు. దీంతో చాలా కాలం నుంచి మూవీస్ కు దూరంగా ఉంటూ..ఇక ఆయనకు సెట్ అయ్యే జోనర్ లోనే అద్దిరిపోయే కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ఇక వీరిద్దరి కలయికలో వస్తోన్న మూవీ కోసం ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తారో చూడాలి అంటున్నారు ఫ్యాన్స్. 

ఇదిలా ఉంటే..గోపీచంద్ మరో ఇంట్రెస్టింగ్ డైరెక్టర్తో సినిమా షురూ చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది.జిల్,రాధేశ్యామ్ సినిమాలకు డైరెక్టర్ గా పనిచేసిన రాధాకృష్ణ(Radhakrishna)తో  గోపీచంద్ నెక్స్ట్ సినిమా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను బడా ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మించనున్నట్లు సమాచారం. ఇప్ప‌టికే ఈ మూవీ స్టోరీ లైన్‌ ను విన్న హీరో గోపీ చంద్‌ కు కథ నచ్చేసిందట. త్వరలో ఈ సినిమాపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.