Viswam: ఆ ముగ్గురికి హిట్ కాదు.. భారీ బ్లాక్ బస్టర్ అవసరం.. లేదంటే అంతే!

మ్యాచో స్టార్ గోపీచంద్, కావ్య థాపర్ జంటగా శ్రీనువైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విశ్వం’.  టీజీ విశ్వ ప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ సినిమా ఇవాళ శుక్రవారం (అక్టోబర్ 11న) థియేటర్లలో రిలీజయింది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్‌‌‌‌‌‌‌‌తో పాటు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం ఈ చిత్రం నుంచి మాస్ నెంబర్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు.

‘చూపుల్లో చిలిపోడే.. చేతల్లో మొండోడే.. మాటల్లో మంచోడే.. పెళ్లైనా, లొల్లైనా తనతోనే ఫిక్స్ అయ్యాలే’ అంటూ గోపీచంద్‌‌‌‌పై  తనకున్న ప్రేమను కావ్య థాపర్ చెబుతూ సాగిందీ పాట.  ‘మల్లా రెడ్డి కాడ.. తెచ్చానే మల్లె మూర.. నీళ్ల బాయి కాడ.. జడలోనే పెడతా రా..  యల్లారెడ్డిగూడ రాసిస్తాలే నీ పేర.. ఏలు పట్టుకుని నన్ను ఏలుకో దొర.. ’ అంటూ సురేష్ గంగుల క్యాచీ లిరిక్స్ రాయగా, భీమ్స్ సిసిరోలియో కంపోజ్ చేయడంతో పాటు రోహిణి సోరట్‌‌‌‌తో కలిసి పాడిన విధానం ఆకట్టుకుంది. ఈ మాస్ బీట్స్‌‌‌‌కు గోపీచంద్, కావ్య థాపర్ చేసిన డ్యాన్స్ మూమెంట్స్  ఇంప్రెస్ చేస్తున్నాయి.

హీరో గోపీచంద్ చేసిన రీసెంట్ సినిమాలు సైతం బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ కాలేదు. నిర్మాత విశ్వప్రసాద్ వరుస సినిమాలు చేస్తున్నారు. అయితే అందులో హిట్స్ అయ్యేవి కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇక శ్రీను వైట్లకు కూడా వరుస ఫెయిల్యూర్స్ వెంటాడుతున్నాయి. దీంతో భారీ బ్లాక్ బస్టర్ కోసం ఈ ముగ్గురు కలిసి చేసిన ప్రయత్నం 'విశ్వం' ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.