హీరో గోపీచంద్ (Gopichand) అనగానే యాక్షన్ సినిమాలు గుర్తొస్తాయి. అలాగే దర్శకుడు శ్రీనువైట్ల (Srinu Vaitla) పేరు చెబితే కామెడీ ఎంటర్‌టైనర్స్ గుర్తొస్తాయి. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘విశ్వం’ (Viswam) అనే యాక్షన్ ఎంటర్‌టైనర్ వచ్చింది. కావ్యా థాపర్ హీరోయిన్. చిత్రాలయ స్టూడియోస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి నిర్మించాయి. దసరా సందర్భంగా విడుదలైన విశ్వం మూవీకి.. టాక్ యావరేజ్‌గా ఉన్న కమర్షియల్‌గా హిట్ అందుకోలేకపోయింది.ఇపుడు
విశ్వం ఓటీటీ::
ఈ మూవీ శుక్రవారం (నవంబర్ 1న ) సడెన్గా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో విశ్వం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. అయితే, ప్రస్తుతం తెలుగులో మాత్రమే విశ్వం డిజిటల్ ప్రీమియర్ అవుతోంది.
విశ్వం కలెక్షన్స్:
కొంత గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల నుంచి సినిమా వస్తుండడంతో ఈసారి ఎలాంటి సబ్జెక్ట్‌తో ఎంటర్‌టైన్ చేయబోతున్నాడు అనే ఆసక్తి ప్రేక్షకులు ఏర్పడింది. ముఖ్యంగా తన మార్క్ ఎంటర్‌టైన్మెంట్ ఫార్మట్‌ను ఆయన బ్రేక్ చేస్తాడా లేదా అనే ఆసక్తి ఉండేది. కానీ, విశ్వం కథ చాలా రొటీన్‌గా ఉన్న కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని టాక్ వచ్చింది. అయితే కమర్షియల్ గా సక్సెస్ కాలేకపోయింది. దాదాపు రూ. 35 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన విశ్వం మూవీకి 20 రోజుల్లో వరల్డ్ వైడ్‌గా రూ.17 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది.
Also Read : ఆసుపత్రిలో చేరిన కమల్‌హాసన్ సోదరుడు చారు హాసన్
కథేంటంటే::
హైదరాబాద్ సిటీలో బాంబ్ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ బ్లాస్ట్ ఎవరో చేశారో తెలిసిన మినిష్టర్ (సుమన్)ను ఆ హత్యను చూసిన ఓ చిన్నారిని చంపేందుకు వరుస అటాక్‌లు జరుగుతుంటాయి. ఆ పాప కుటుంబానికి పరిచయమైన గోపీరెడ్డి (గోపీచంద్) తన ప్రాణాలకు తెగించి కాపాడుతుంటాడు. అయితే ఆ చిన్నారి కుటుంబంలోని సమీరా (కావ్య థాపర్) అతనికి ముందే ఇటలీలతో పరిచయం ఉంటుంది. పాపను కాపడాటానికే అతను వచ్చాడా.. విశ్వం అనే తన పేరును ఎందుకు గోపీరెడ్డిగా మార్చుకున్నాడు.. అసలు ఎవరీ విశ్వం.. అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. బాంబ్ బ్లాస్ట్‌ల వెనుక ఉన్నది ఎవరు.. లాంటి విషయాలు తెలియాలంటే ‘విశ్వం’ సినిమా థియేటర్లో చుడనివారు ఓటీటీలో చూడాల్సిందే.