గోపీచంద్ హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష తెరకెక్కిస్తున్న చిత్రం ‘భీమా’. యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. గత కొద్ది రోజులుగా హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ పూర్తయింది.
కాకినాడ, రాజానగరం, అద్దరిపేట బీచ్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు తీశామని మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన వర్కింగ్ స్టిల్‌లో గోపీచంద్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు ఇతర కమర్షియల్ అంశాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు. జె.స్వామి సినిమాటోగ్రాఫర్. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని దర్శక నిర్మాతలు చెప్పారు.