Bhimaa Movie: గోపీచంద్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ అదిరింది..

Bhimaa Movie: గోపీచంద్ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్ అదిరింది..

గోపీచంద్ (Gopichand) హీరోగా కన్నడ దర్శకుడు ఎ.హర్ష(Harsha) తెరకెక్కిస్తున్న చిత్రం భీమా(Bhimaa). యూనిక్ యాక్షన్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌గా రాబోతున్న ఈ సినిమాను కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. 

ఇవాళ కొత్త సంవత్సరం సందర్భంగా గోపీచంద్‌ భీమా ఫస్ట్‌లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్గా భీమా టైటిల్‌తో పోస్టర్ రిలీజ్ చేస్తూ..ఆడియాన్స్కు న్యూ ఇయర్ విషెష్ తెలియజేశారు. గత కొద్ది రోజులుగా హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌‌ను మంగళూరులో దట్టమైన అటవీ ప్రాంతంలో చిత్రీకరిస్తున్నారు మేకర్స్. 

ఇప్పటికే భీమా నుంచి విడుదలైన గోపీచంద్‌‌ ఫస్ట్ లుక్‌‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో  గోపీచంద్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి తనదైన పంథాను ధాటి..స్టోరీ సెలక్ట్ చేసుకున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే..ప్రతిసారి పోస్టర్లతో హీట్ పెంచకండి..త్వరలో టీజర్ రిలీజ్ చేసి మా ఆకలి తీర్చండి..అంటూ గోపీచంద్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ సినిమాలో గోపి చంద్కు జోడీగా మాళవిక శర్మ, ప్రియా భవానీ శంకర్‌ లు నటిస్తున్నారు. కేజీఎఫ్ మరియు సలార్‌ సినిమాలకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన రవి బస్రూర్‌ భీమా మూవీకి సంగీతాన్ని అందిస్తున్నాడు.